UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
UPSC: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 2025లో నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది.
UPSC Calendar 2025: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 2025లో నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. యూపీఎస్సీ విడుదల చేసిన ఈ క్యాలెండర్‌లో 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య నిర్వహించే పరీక్షల తేదీలు ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జనవరి 22న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమ్స్) నోటిఫికేషన్ వెలువడనుంది. మే 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇక, యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను ఆగస్టు 22 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. వీటితోపాటు ఇంజినీరింగ్ సర్వీసెస్, ఎన్డీఏ & ఎన్‌ఏ (1) ఎగ్జామ్, ఎన్డీఏ & ఎన్‌ఏ (2) ఎగ్జామ్, సీడీఎస్ పరీక్ష(1) ఎగ్జామ్, సీడీఎస్ పరీక్ష(2) ఎగ్జామ్, కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్, ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎగ్జామ్-2025, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్, సీఏపీఎఫ్ (అసిస్టెంట్ కమాండెంట్స్) ఎగ్జామ్, సీఏపీఎఫ్ (అసిస్టెంట్ కమాండెంట్స్) ఎగ్జామ్, తదితర పరీక్షలు నిర్వహించనున్నారు.
మెయిన్స్ పరీక్ష తేదీ: 22.08.2025 నుంచి 5 రోజులపాటు నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష తేదీ: 16.11.2025 నుంచి 7 రోజులపాటు నిర్వహిస్తారు.
యూపీఎస్సీ 2024 పరీక్షల క్యాలెండర్ 2025..
ALSO READ:
UPSC- ఐఈఎస్/ ఐఎస్‌ఎస్‌ఈ - 2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
భారత ప్రభుత్వ ఎకనామిక్స్, స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూనియర్ టైమ్ స్కేల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్(IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (ISSE)- 2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌లో 18 పోస్టులను, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌లో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..