UPSC CDS Results: యూపీఎస్సీ సీడీఎస్ఈ (I) - 2024 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
UPSC CDSE 2024 Results: త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన 'కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ CDSE (1)-2024' రాత పరీక్ష ఫలితాలువిడుదలయ్యాయి.
UPSC CDSE 2024 Results: త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన 'కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ CDSE (1)-2024' రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మే 9న విడుదల చేసింది. త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. యూపీఎస్సీ ఏప్రిల్ 21న సీడీఎస్ఈ రాతపరీక్షలో మొత్తం 8373 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అనంతరం తుది ఫలితాలను విడుదల చేస్తారు. పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల వివరాలను తుది ఫలితాలు వెల్లడించిన పదిహేను రోజుల్లోగా వెబ్‌సైట్‌లో ఉంచుతామని యూపీఎస్సీ స్పష్టం చేసింది.
UPSC CDS 2 result 2022: ఫలితాలు ఇలా చూసుకోండి...
1) ఫలితాల కోసం మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - upsc.gov.in
2) అక్కడ హోంపేజీలో “What’s New” లింక్ మీద క్లిక్ చేయాలి.
3) ఇప్పుడు “Written Result (with name): Combined Defence Services Examination (I), 2024” ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
4) సీడీఎస్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఉంటాయి.
5) 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే.
6) ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
UPSC CDSE 1 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్(I)-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గతేడాది డిసెంబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని 457 ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి డిసెంబరు 20 నుంచి జనవరి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెల్లిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ విధానం..
ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ వివరాలు..
అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్స్, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్ మిలటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడమీలో చేరినవాళ్లకు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏయిర్ ఫోర్స్ అకాడమీకి ఎంపికైనవారికి పైలట్ శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుంది. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఏయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది.