UCIL : యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
UCIL Trade Apprentice: జార్ఖండ్ ప్రాంతంలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) వివిధ ట్రేడ్‌లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
UCIL Trade Apprentice: జార్ఖండ్ ప్రాంతంలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) వివిధ ట్రేడ్‌లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 243 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 243
* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ ఫిట్టర్: 82
➥ ఎలక్ట్రీషియన్: 82
➥ వెల్డర్ 40
➥ టర్నర్/ మెషినిస్ట్: 12
➥ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 05
➥ మెక్. డీజిల్/మెక్. MV: 12
➥ కార్పెంటర్: 05
➥ ప్లంబర్: 05
అర్హత: 10వ తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 13.10.2023 నాటికి 18 - 25 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: I T Iలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 13.10.2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.11.2023
ALSO READ:
ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో 91 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే
కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆప్కాబ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..