అన్వేషించండి

TSPSC Paper Leak: ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మరిన్ని ప్రశ్నపత్రాలు, తొమ్మిది పరీక్షలు రీషెడ్యూల్?

టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలు మారే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన నిందితుడి వద్ద త్వరలో నిర్వహించాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం.

టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలు మారే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన నిందితుడి వద్ద త్వరలో నిర్వహించాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నపత్రాల స్థానంలో కొత్తవి సిద్ధం చేయనున్నట్లు రెండు రోజుల క్రితం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు. కొత్త ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడానికి, ప్రింటింగ్ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్; మే నెలల్లో టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు చేసిన తొమ్మిది రకాల పోస్టుల పరీక్షలు రీషెడ్యూలు అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది.

నాలుగు పెన్‌డ్రైవ్‌లలో 60 జీబీ పైగా డేటా..
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. కేసులో కీలక నిందితుడు, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది. నాలుగు పెన్‌డ్రైవ్‌లలో 60 జీబీకి పైగా సమాచారమున్నట్లు వెల్లడైంది. ఆ డేటాను విశ్లేషించడంతోపాటు, డెలిట్ చేసిన డేటాను తిరిగి రాబట్టడంపైనా విచారణ అధికారులు దృష్టి సారించారు. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో కీలక సమాచారం సిట్ చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్, సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపిన సిట్.. వాటిలోని ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇప్పటికే కొంత అంచనాకు వచ్చింది.

మరిన్ని ప్రశ్నపత్రాలు బయటకు...
ఇప్పటివరకు ఏఈ సివిల్, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాలు మాత్రమే లీకైనట్లు వెల్లడి కాగా.. వెటర్నరీ అసిస్టెంట్, ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ ప్రశ్నపత్రాలూ టీఎస్‌పీఎస్సీ నుంచి బయటికి వెళ్లాయనే ఆధారాలు సిట్‌కు లభ్యమైనట్లు తెలిసింది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లలో వాటికి సంబంధించిన సమాచారం ఉందని సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు, కీలు, సమాధానాలతో కూడిన సమాచారంతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన ప్రశ్నపత్రాల ఫోల్డర్లనూ ప్రవీణ్ తస్కరించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతను తస్కరించిన ప్రశ్నపత్రాలెన్ని అన్నది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల భవితవ్యాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక తేల్చనుందని భావిస్తున్నారు. లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిఉన్న వ్యవహారం కావడంతో సిట్ ఆచితూచి ముందుకెళ్తోంది.

ప్రవీణ్ కాంటాక్ట్ లిస్టులో 50 మంది యువతులు..
ప్రవీణ్ ఫోన్ కాంటాక్టుల జాబితాలో 50 మంది వరకు యువతులున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు అతడితో ఛాటింగ్ చేసినట్లు వెల్లడైంది. లీకేజీ వ్యవహారానికి సంబంధించిన ఆధారాల్ని రాబట్టడంలో వారి వాంగ్మూలం కీలకం కానుంది. ముగ్గురు యువతులకు దర్యాప్తు బృందం ఫోన్ చేయగా.. కేసులోకి తమను లాగొద్దని, తమ పరువు పోతుందని వారు ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో మిగిలినవారినీ విచారించాలా, సాక్షులుగా చేర్చాలా అని దర్యాప్తు అధికారులు మీమాంసలో పడ్డారు.

ప్రశ్నపత్రాలు కోచింగ్ సెంటర్లకు చేరాయా?
ప్రశ్నపత్రాలు కోచింగ్ సెంటర్లకు చేరాయా? అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి పలువురు టీఎస్‌పీఎస్సీ సిబ్బందిని సిట్ విచారించింది. కార్యాలయంలో ప్రవీణ్, రాజశేఖర్‌ల వ్యవహారశైలి గురించి ప్రశ్నించింది. నగరంలోని కొన్ని కోచింగ్ సెంటర్లలోనూ ఆరా తీసింది. వాటి నిర్వాహకులకు ప్రశ్నపత్రాలను అమ్మేందుకు ప్రవీణ్ బృందం ప్రయత్నించిందనే ప్రచారం నేపథ్యంలో ఆ వైపు దృష్టి సారించింది.

Also Read: షెడ్యూలు ప్రకారమే 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పరీక్షలు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్

Also Read: అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ రద్దుచేసిన టీఎస్‌పీఎస్సీ, త్వరలోనే కొత్త తేదీ వెల్లడి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget