News
News
X

TSPSC AE Exam: అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ రద్దుచేసిన టీఎస్‌పీఎస్సీ, త్వరలోనే కొత్త తేదీ వెల్లడి!

ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తానని అధికారులు తెలిపారు.

FOLLOW US: 
Share:

ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు మార్చి 5న నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్ష కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమైంది. దీంతో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)  పరీక్షపై బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి మార్చి 14న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజా నిర్ణయం వెలువడింది. 

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74,478  మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరికి మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షపై న్యాయ నిపుణుల సలహాలు, పరిస్థితులకు అనుగుణంగా పరీక్షను రద్దుచేస్తూ టీఎస్‌పీఎస్సీ పరీక్ష రద్దు నిర్ణయం తీసుకుంది.  లీకేజీ వ్యవహారం ఇద్దరు, ముగ్గురి వరకు మాత్రమే పరిమితమైందని వెల్లడైతే ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అనే విషయమై ప్రాథమిక చర్చ నిర్వహించింది. పరీక్ష రద్దు చేస్తే అభ్యర్థుల నుంచి ఎదురయ్యే అభ్యంతరాలు, చేయకుంటే వచ్చే వివాదాలను పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీర్ పోస్టుల భర్తీక టీఎస్‌పీఎస్సీ మొదట నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే భూగర్భజలశాఖ పరిధిలో మరో 4 డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 837కి చేరింది. 

పోస్టుల వివరాలు...

మొత్తం ఖాళీలు: 837

* అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: 434 పోస్టులు 

విభాగాలవారీగా పోస్టుల వివరాలు..

1)  అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్):  62 పోస్టులు

 విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ(సివిల్)

2)  అసిస్టెంట్ ఇంజినీర్: 41 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్.

3) అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.

4) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 29 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .

5) టెక్నికల్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .

6)  అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులు
విభాగం:  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.

7) అసిస్టెంట్ ఇంజినీర్: 227 పోస్టులు
విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 

8) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 12 పోస్టులు
విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.

9)  అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు
విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్

10) అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు
విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

* జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399 పోస్టులు

1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:  27 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ.

2) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 68 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్

3) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 32 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.

4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 212 పోస్టులు
విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 

5) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60 పోస్టులు
విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

* డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) : 4 పోస్టులు
విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.

Notification

Published at : 15 Mar 2023 10:06 PM (IST) Tags: Telangana Jobs TSPSC Jobs TSPSC Recruitment 2022 TSPSC AE Recruitment 2022 Latest Telugu Jobs News

సంబంధిత కథనాలు

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?