TS Hostel Welfare Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, సంక్షేమ వసతి గృహాల్లో 581 ఖాళీలు, టీఎస్‌పీఎస్సీ ప్రకటన!
ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీచరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
తెలంగాణ సంక్షేమ వసతి గృహాల్లో 581 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీస్సీ డిసెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనవరి 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీచరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
పోస్టుల వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 581 పోస్టులు
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1(ట్రైబల్ వెల్ఫేర్) -05
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2(ట్రైబల్ వెల్ఫేర్) – 106
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు (ఎస్సీ డెవలప్‌మెంట్) -70
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్) – 228
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
➥ వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05
➥ మ్యాట్రన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
➥ వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
➥ మ్యాట్రన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02
➥ లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19
Also Read:
నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్, 207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 207 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో వెటర్నరీ విభాగంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండగా, హార్టికల్చర్ విభాగంలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
➙ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
➙ హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
1392 జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-4' ఉద్యోగార్థులకు అలర్ట్, దరఖాస్తు ప్రక్రియ వాయిదా - అప్లికేషన్ కొత్త తేదీలివే!
రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వారంపాటు వాయిదావేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాజా ప్రకటన మేరకు డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..