Librarian key: టీఎస్‌పీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుల తుది 'కీ' వెల్లడి, వెబ్‌సైట్‌లో అందుబాటులో
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో లైబ్రేరియన్ పోస్టులకు నిర్వహించిన సీబీఆర్‌టీ పరీక్ష తుది 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో లైబ్రేరియన్ పోస్టులకు నిర్వహించిన సీబీఆర్‌టీ పరీక్ష తుది 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ సీట్లను నుంచి కమిషన్ అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు తుది కీ చూసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71 పోస్టులకు మే 17న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక కీని మే 27న వెల్లడించింది. ప్రాథమిక 'కీ'పై జూన్ 1 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలించి.. తుది కీని ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థుల సమాధాన పత్రాలు, తుది కీ వివరాలను కమిషన్ వెల్లడించింది.
అభ్యర్థుల రెస్పాన్స్ షీట్, ఫైనల్ 'కీ' కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
టీఎస్‌పీఎస్సీ జూనియర్ లెక్చరర్ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, సబ్జెక్టు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 29న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, హిస్టరీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 3న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక అభ్యర్థి రెండు పరీక్షలకు దరఖాస్తు చేస్తే వేర్వేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌బీఐలో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 6లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ అర్హతతో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఈ పోస్టులను ఐడీబీఐ భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..