News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JL Exam Key: జేఎల్‌ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నాలుగు సబ్జెక్టుల రాతపరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నాలుగు సబ్జెక్టుల రాతపరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. వీటిలో సెప్టెంబర్‌ 12, 13, 14 తేదీల్లో నిర్వహించిన జనరల్‌ స్టడీస్‌/ మెంటల్‌ ఎబిలిటీ(పేపర్‌-1), ఇంగ్లిష్‌/ బోటనీ/ ఎకనామిక్స్‌/ మ్యాథ్స్‌(పేపర్‌-2) పరీక్షల ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్‌ షీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు అక్టోబర్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలపవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లో అభ్యంతరాలు తెలపడానికి వీల్లేదు. నిర్ణీత గడువులోగా నమోదైన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ నియామక రాత పరీక్షలు సెప్టెంబర్‌ 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మల్టీజోన్‌-1లో 724, మల్టీజోన్‌-2లో 668 పోస్టులను భర్తీ కానున్నాయి. 

మాస్టర్ క్వశ్చన్ పేపర్- ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..

సబ్జెక్టులవారీగా ఇంకా జరగాల్సిన పరీక్షలు..

➥ కామర్స్: 25.09.2023

➥ సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్: 26.09.2023

➥ హిందీ: 27.09.2023

➥ హిస్టరీ, సంస్కృతం: 29.09.2023

➥ ఉర్దూ: 03.10.2023.

హాల్‌టికెట్లు అందుబాటులో...

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, సబ్జెక్టు వివరాలు నమోదుచేసి హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 29న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, హిస్టరీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్‌ 3న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక అభ్యర్థి రెండు పరీక్షలకు దరఖాస్తు చేస్తే వేర్వేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 

జేఎల్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్షవిధానంమొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

                                 

పోస్టుల వివరాలు: 1392

మల్టీ జోన్-1: 724 పోస్టులు

- ఆసిఫాబాద్-కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
- కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
- కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూలర్)

మల్టీ జోన్-2: 668 పోస్టులు

- సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి-యాదాద్రి, జనగామ
- మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
- మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 23 Sep 2023 07:45 PM (IST) Tags: TSPSC Answer Key TSPSC JL Answer Key TSPSC JL Exam Answer Key JL Answer Key TSPSC JL Response Sheets

ఇవి కూడా చూడండి

Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!

Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!