AMVI Key: ఏఎంవీఐ రాత పరీక్ష ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి జూన్ 28న నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ జులై 3న వెల్లడించింది. రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది.
తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి జూన్ 28న నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ జులై 3న వెల్లడించింది. అభ్యర్థుల సమాధానాల పత్రాలను (రెస్పాన్స్ షీట్లు) కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. ఆగస్టు 2 వరకు రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ 'కీ'పై ఏమైనా అభ్యంతరాలుంటే జులై 4 నుంచి 6 వరకు తెలియజేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసే అభ్యంతరాలను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. మరే ఇతర విధానాల్లోనూ అభ్యంతరాల నమోదుకు అవకాశం లేదు. నిర్ణీత గడువు తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యంతరాలను స్వీకరించరు.
రాష్ట్రంలో 113 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు జూన్ 28న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగు జిల్లాల్లోని 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 76 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాతపరీక్షకు సంబంధించి మొత్తం 5,572 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. పేపర్-1 పరీక్షకు 4734 (76.52 శాతం), పేపర్-2 పరీక్షకు 4722 (76.32శాతం) మంది హాజరయ్యారు
మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్‌లో 140 ఖాళీలు, అర్హతలివే!
చెన్నైలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 'రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్' వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 19లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial