అన్వేషించండి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

టీఎస్‌పీఎస్సీ మే నెలలో సీబీఆర్‌టీ విధానంలో నిర్వహించిన ఏఈఈ (సివిల్‌), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇంటర్‌విద్యలో లైబ్రేరియన్‌ పోస్టుల రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసింది.

టీఎస్‌పీఎస్సీ మే నెలలో సీబీఆర్‌టీ విధానంలో నిర్వహించిన ఏఈఈ (సివిల్‌), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇంటర్‌విద్యలో లైబ్రేరియన్‌ పోస్టుల రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని శనివారం(మే 27) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ సీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్‌ 27 సాయంత్రం 5 గంటల వరకు పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి.

ఆయా పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలపై ఏమైనా  అభ్యంతరాలుంటే జూన్‌ 1 నుంచి జూన్ 3న సాయంత్రం 5 గంటల వరకు తెలపవచ్చు. ఇంగ్లిష్‌లో మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలను స్వీకరించరు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత నమూనాలో పంపిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ-మెయిల్స్‌, రాతపూర్వకంగా వచ్చిన వాటిని పరిగణించరు.

ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్‌లో విధానంలో టీఎస్‌పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది. అంతకు ముందు మే 8న ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌; మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మే 19న ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించింది. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల పరీక్షను మే 16న, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి మే 17న ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్షలను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది.

ఆన్సర్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

➥ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

➥ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబర్ 16 నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 19న ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహించింది. తాజాగా ఆన్సర్ కీతోపాటు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

➥ తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 10 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 16న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. తాజాగా ఆన్సర్ కీతోపాటు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

➥ తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం, మే 17న లైబ్రేరియన్ పోస్టులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించింది. తాజాగా ఆన్సర్ కీతోపాటు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget