(Source: ECI/ABP News/ABP Majha)
TSPSC Group 4 Recruitment 2022: నిరుద్యోగులకు షాకిచ్చిన టీఎస్‌పీఎస్సీ, 'గ్రూప్-4'లో తగ్గిన 1129 పోస్టులు, 8039 ఖాళీల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ జారీ! కారణమిదే!
డిసెంబరు 2న విడుదల చేసిన ప్రాథమిక నోటిషికేషన్‌లోని 9168 పోస్టులకు బదులుగా డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో 8039 గ్రూప్-4 ఖాళీలను చూపించింది. అంటే 1129 పోస్టులను తగ్గించింది అన్నమాట.
గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టడానికి ఆపసోపాలు పడిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్టకేలకు డిసెంబరు 30న అర్ధరాత్రి 11.45 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. దీంతో రోజంతా పడిగాపులుగాచిన అభ్యర్థులు ఉపశమనంగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇంతలోనే ఉద్యోగార్థులకు కమిషన్ పెద్ద షాకిచ్చింది. డిసెంబరు 2న విడుదల చేసిన ప్రాథమిక నోటిషికేషన్‌లోని 9168 పోస్టులకు బదులుగా డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో 8039 గ్రూప్-4 ఖాళీలను చూపించింది. అంటే 1129 పోస్టులను తగ్గించింది అన్నమాట.
పంచాయతీరాజ్ విభాగంలో 1245 పోస్టులకుగాను కొన్నింటికి మాత్రమే ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. మిగిలిన ఖాళీల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల పోస్టుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ విభాగంలో కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ & రూరల్ ఎంప్లాయ్‌మెంట్‌లో 1245 పోస్టులకుగాను కేవలం 37 పోస్టులను మాత్రమే నోటిఫై చేసింది. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో 1208 పోస్టులను తొలగించినట్లయింది.
కొన్ని విభాగాల్లో పెరిగిన ఖాళీలు:
పంచాయతీరాజ్ విభాగంలో 1208 పోస్టులను తొలగించగా.. మరికొన్ని విభాగాల్లో 79 పోస్టులను పెంచారు. వీటిలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీల సంఖ్య ఒక పోస్టు పెరిగి 742 నుంచి 743 కి చేరింది. ఇక రెవెన్యూ విభాాగంలో 19 పెరిగాయి. దీంతో ఆ విభాగంలో ఖాళీల సంఖ్య 2077 నుంచి 2096కి పెరిగింది. ఇక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విభాగంలో ఏకంగా 59 కొత్త పోస్టులను చేర్చారు. దీంతో ఈ విభాగంలో 18గా ఉన్న ఖాళీల సంఖ్య ఏకంగా 77 కి చేరింది.
Also Read:
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..