TSPSC Physical Director Application: ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
ఈ పోస్టుల భర్తీకి జనవరి 6న సాయంత్రం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27న సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
![TSPSC Physical Director Application: ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే? tspsc has enabled application window for the recruitment of physical director posts, apply now TSPSC Physical Director Application: ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/07/7abf17540e09a90cd463c7f121f9d1d21673062134532522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6న సాయంత్రం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27న సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు...
1) ఫిజికల్ డైరెక్టర్: 37
విభాగం: టెక్నికల్ ఎడ్యుకేషన్.
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్/ఫిజికల్ ఎడ్యుకేషన్ సైన్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగానికి సంబంధించి మంచి రికార్డు ఉండాలి.
2) ఫిజికల్ డైరెక్టర్: 91
విభాగం: ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్.
అర్హత: పీజీ డిగ్రీ (ఎంఏ/ఎంకామ్/ఎంఎస్సీ)తోపాటు కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.320. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఫిజికల్ ఎడ్యుకేషన్-ఎంపీఈడీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
జీతం..
➥ ఫిజికల్ డైరెక్టర్ (టెక్నికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు లెవల్ 9ఎ కింద రూ.56,100 ఇస్తారు. అదే లెవల్ 10 కింద రూ.57,700 ఇస్తారు.
➥ ఫిజికల్ డైరెక్టర్ (ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్) పోస్టులకు రూ.54,220 – రూ.1,33,630.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.01.2023
Notification
Online Application
Also Read:
తెలంగాణలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ & బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)