అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

TSPSC Group1 Exam: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, ఆఫ్‌లైన్‌లోనే ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ - టీఎస్‌పీఎస్సీ క్లారిటీ

TSPSC: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు మే 1న ఒక ప్రకటనలో తెలిపింది.

TSPSC Group1 Prelims Exam Pattern: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు మే 1న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్షను ఓఎంఆర్(OMR) విధానంలోనే నిర్వహించనున్నట్లు TSPSC స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను, అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీస్సీ ఇప్పటికే వెల్లడించింది. పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి 4 గంటల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 2 సంవత్సరాలకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో గరిష్ఠవయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు చేరింది. అయితే నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తించనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీ్స్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. 

TSPSC Group1 Exam: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, ఆఫ్‌లైన్‌లోనే ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ - టీఎస్‌పీఎస్సీ క్లారిటీ

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

TSPSC Group 1 Notification: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల - పోస్టులు, అర్హతలు, పరీక్ష వివరాలు ఇలా

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.

మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget