అన్వేషించండి

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగియడంతో.. పరీక్షలు, పరీక్షల ఫలితాలపై టీఎస్‌పీఎస్సీ దృష్టి సారించింది. డిసెంబర్ 10 లోపు గ్రూప్-4 మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది.

Group 4 Results: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగియడంతో.. నియామక పరీక్షలు, ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలపై టీఎస్‌పీఎస్సీ (TSPSC) దృష్టి సారించింది. గత జులై 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-4 (Group-4) పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఈ వారంలోనే వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే గ్రూప్-4 ప్రాథమిక, తుది కీలను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫలితాల వెల్లడి మాత్రమే ఉందనగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ ప్రక్రియ ముగియడంతో గ్రూప్-4 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ 10 లోపు గ్రూప్-4 మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 1 : 2 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

తెలంగాణలో రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్‌-4 కేటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 1న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9,51,321 మంది దరఖాస్తు చేశారు. జులై 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తం 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్‌-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు.  'గ్రూప్‌-4' ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేేసింది.

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఆన్సర్ కీలను టీఎస్‌పీస్సీ అక్టోబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ప్రిలిమినరీ ఆన్సర్ కీలో నమోదైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఫైనల్ కీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

➥ పేపర్-1లో 7 ప్రశ్నలకు తొలగించగా.. 8 ప్రశ్నలకు సమాధానాలను మార్చింది. అలాగే పేపర్-2లో 3 ప్రశ్నలను తొలగించగా.. 5 ప్రశ్నలకు సమాధానాలను మార్చింది.

➥ పేపర్-1లో 11, 21, 60, 73, 129, 132, 148 ప్రశ్నలకు టీఎస్‌పీఎస్సీ తొలగించింది. అలాగే పలు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. వాటిలో ప్రశ్న-19 సమాధానాన్ని 2 నుంచి 4 కి; ప్రశ్న-31 సమాధానాన్ని 2 నుంచి 1, 2 , 3, 4కి; ప్రశ్న-40 సమాధానాన్ని 1 నుంచి 2కి; ప్రశ్న-50 సమాధానాన్ని 1 నుంచి 1, 2కి; ప్రశ్న-55 సమాధానాన్ని 2 నుంచి 2, 3కి; ప్రశ్న-64 సమాధానాన్ని 1 నుంచి 3కి; ప్రశ్న-128 సమాధానాన్ని 1 నుంచి 2కి; ప్రశ్న-139 సమాధానాన్ని 1 నుంచి 1, 4కి మార్చింది.

➥ పేపర్-2లో 25, 40, 78 ప్రశ్నలకు టీఎస్‌పీఎస్సీ తొలగించింది. అలాగే పలు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. వాటిలో ప్రశ్న-11 సమాధానాన్ని 2 నుంచి 2, 4కి; ప్రశ్న-18 సమాధానాన్ని 1 నుంచి 4కి; ప్రశ్న-33 సమాధానాన్ని 4 నుంచి 1కి; ప్రశ్న-94 సమాధానాన్ని 2 నుంచి 3కి; ప్రశ్న-96 సమాధానాన్ని 2 నుంచి 3కి మార్పు చేసింది.
గ్రూప్-4 ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget