(Source: ECI/ABP News/ABP Majha)
TSPSC Group 4 Application: నేటి నుంచి 'గ్రూప్-4' ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు! వివరాలు ఇలా!
గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు జనవరి 12 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు జనవరి 12 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్-429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్-6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్-18 పోస్టులు, వార్డు ఆఫీసర్-1,862 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి.
గ్రూప్-4 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం..
గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని అంచనా వేస్తోంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.
త్వరలో గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లు..
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ మరో వారంలో వెలువడే అవకాశం ఉంది. తర్వాత వారం నుంచి రెండు వారాల వ్యవధిలో గ్రూప్ -3 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. గ్రూప్ -2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్ -3లో 1,373 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. గతంలో గ్రూప్-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 726కు చేరింది. ప్రభుత్వం గ్రూప్-2లో మరో 6 రకాల పోస్టులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఎఎస్‌ఒ, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులును చేర్చింది.
అలాగే గ్రూప్-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌ఒడిల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చింది. గతంలో ప్రభుత్వం ప్రభుత్వం అనుమతించిన పోస్టులకు అదనంగా తాజాగా అనుమతించిన పోస్టులను కలిపి కమిషన్ ప్రకటనలు జారీ చేయనున్నది. కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
Also Read:
నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్, 207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 207 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో వెటర్నరీ విభాగంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండగా, హార్టికల్చర్ విభాగంలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..