అన్వేషించండి

Group 1 Prelims Results: ఒకట్రెండు రోజుల్లో 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్ ఫలితాలు - టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

ఒకట్రెండు రోజుల్లో కోర్టు కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. దీంతో జనవరి 10 లేదా 11 తేదీల్లో ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కమిషన్ పూర్తిచేసింది. 

తెలంగాణ తొలి 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. వీలైనంత త్వరలో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-1 ప్రక్రియపై ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఎప్పుడో వెలువడాల్సిన ఫలితాల ప్రక్రియ వాయిదా పడింది. దీనిపై జనవరి 9న కోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఒకట్రెండు రోజుల్లో కోర్టు కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. దీంతో జనవరి 10 లేదా 11 తేదీల్లో ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే పూర్తిచేసింది. 

తెలంగాణలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించి, చివరికి 5 ప్రశ్నలను తొలిగించి, నవంబర్‌ 15న తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ తర్వాత రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 పై ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలతాల వెల్లడి ప్రక్రియ ఆగిపోయింది. 

రెండు నెలల క్రితమే పూర్తి..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల OMR షీట్ల స్కానింగ్‌ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ రెండు నెలల క్రితమే పూర్తి చేసింది. ఫలితాల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని కమిషన్‌ భావిస్తోంది. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించింది. గతంలో గ్రూప్‌-1 పరీక్ష సమయంలో జరిగిన పొరపాట్లను అంచనా వేస్తూ.. పటిష్ట ప్రణాళికతో ఫలితాల వెల్లడికి అడుగులు వేస్తోంది. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తొలుత ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కోర్టు కేసులతో ఫలితాల్లో జాప్యం జరిగింది. మే 28న సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో ఏప్రిల్‌‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే, కోర్టు కేసులతో ఆలస్యం కావడంతో ప్రిలిమ్స్‌ ఫలితాలకు మెయిన్స్‌ పరీక్షకు మధ్య కనీసం మూడు నెలల గ్యాప్‌ ఇవ్వాలని కమిషన్  అనకుంటుంది. అందులో భాగంగానే మే మొదటి వారంలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది.

మెయిన్స్‌కు 25,150 మంది!
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 503 పోస్టులకు గాను 3,80,081 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారిగా ప్రిలిమినరీ ‘కీ’తో పాటే ప్రతి ఒక్క అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, గ్రూప్‌-1 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలోనే వెల్లడించింది. అంటే, 503 ఉద్యోగాలకు మొత్తం 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. మల్టీజోన్‌, రిజర్వుడ్‌ వర్గాల వారీగా జాబితాను టీఎస్‌పీఎస్సీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఫలితాలు వెల్లడైనా వెంటనే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కమిషన్‌ భావిస్తోంది. అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీపై వారం, పదిరోజుల్లోనే స్పష్టత రానున్నది.

ఆందోళన వద్దు: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌
'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి. జనార్దన్‌ రెడ్డి హామీ ఇస్తున్నారు. అక్టోబర్‌‌లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. కాని అనుకోని ఇబ్బందులు తలెత్తడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. మెయిన్స్‌ పరీక్ష గురించి అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, మిగిలిన పరీక్ష తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. అభ్యర్థులకు వేరే పరీక్షలు లేకుండా అన్ని విధాలా ఆలోచించి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తామని, ప్రిపరేషన్‌ను సైతం దృష్టిలో పెట్టుకునే మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడించిన తర్వాత మెయిన్స్‌ పరీక్షకు తప్పనిసరిగా మూడు నెలల సమయం ఇస్తామని జనార్దన్‌ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

యూపీఎస్సీ స్థాయిలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం! కటాఫ్‌ మార్కులు ఇలా ఉండొచ్చు!

కానిస్టేబుల్‌ పోస్టులకు 5 లక్షలకు పైగా దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ!

➥ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, ప్రతి ఆరుగురిలో ఒకరికి జాబ్ పక్కా? ఎస్‌ఐ పోస్టులకు పోటీ ఇలా!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget