(Source: ECI/ABP News/ABP Majha)
TS Group-I Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
TS Group-I Notification : తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింంది. 503 పోస్టులకు మంగళవారం టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
TS Group-I Notification : తెలంగాణలో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 503 పోస్టులకు టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణలో నోటిఫికేషన్ల జాతర మొదలైంది. సోమవారం పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల అయింది. తాజాగా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ అయింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1 పోస్టులకు 900 మార్కులు రాత పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అభ్యర్థులు మే నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చుని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
గ్రూప్ -1 పోస్టులు
- జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు - 5
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 40
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పోస్టులు - 20
- డీఎస్పీ పోస్టులు - 91
- జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు - 2
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టులు - 8
- జిల్లా ఉపాధి అధికారి పోస్టులు - 2
- జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు - 6
- గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు - 35
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులు - 121
- జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు - 5
- సీటీఓ పోస్టులు - 48
- డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు - 42
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు - 26
- ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు - 4
- జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు - 2
Also Read : TS Govt Jobs Process : గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, ఉద్యోగాల భర్తీ, పరీక్షా విధానాలపై ఉత్తర్వులు