News
News
X

TSPSC DAO Exam: డీఏవో పరీక్షపై భిన్నాభిప్రాయాలు - మార్చాలని కొందరు, మార్చొద్దని మరి కొందరు! షెడ్యూలు ప్రకారమే పరీక్ష?

పరీక్షను వాయిదా వేయకుండా షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని కొందరు పట్టుబడుతుంటే.. మరికొందరు ఇతర పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో డివిజనల్ అకౌంట్స్ అధికారి (డీఏవో) పోస్టుల రాతపరీక్ష తేదీపై అభ్యర్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షను వాయిదా వేయకుండా షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని కొందరు పట్టుబడుతుంటే.. మరికొందరు ఇతర పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ కార్యాలయంలో 53 డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టులను భర్తీకి గతేడాది ఆగస్టులో టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. తరువాత స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పీఆర్టీ పరీక్ష, ఎయిర్ పోర్టు అథారిటీ పరీక్ష, యూజీసీ నెట్ పరీక్షలను అదేరోజున నిర్వహించేలా తేదీలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర పోస్టులకు సిద్ధమవుతూ డీఏవో పరీక్షకు హాజరుకావాలనుకున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కొందరు డీఏవో పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ప్రొఫెషనల్ డిగ్రీలు లేకుండా బీఎస్సీ, బీకాం, బీఏ అర్హతతో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని కోరుతున్నారు. ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్నవారికి ఇతర పోస్టులు ఉన్నాయని, సాధారణ డిగ్రీ కలిగిన వారికి వచ్చిన అవకాశాన్ని దూరం చేయవద్దని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ పరీక్ష తేదీని వాయిదా వేస్తే మరో ఆరునెలల వరకు డీఏవో పరీక్షను నిర్వహించే అవకాశం లేదని తెలిసింది. దీంతో షెడ్యూలు ప్రకారమే డీఏవో పరీక్షను నిర్వహించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 26న జరిగే పరీక్షలను చూస్తే రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకే పరిమితమవాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్షల వివరాల్లోకి వెళితే..

➥  ఫిబ్రవరి 26న తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డీఏఓ (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. 53 డీఏఓ ఉద్యోగ ఖాళీల భర్తీకి దాదాపు పదిహేనేళ్ల తర్వాత ప్రకటన వెలువడింది. ఈ పరీక్షకు 1.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్న ఈ పోస్టులు అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షను ఫిబ్రవరి 26న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌­టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనుంది. 

➥ అయితే అదే రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఇక కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ) ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. అదే రోజున 

➥  స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌–2 పరీక్షను సైతం ఫిబ్రవరి 26నే నిర్వహిస్తున్నారు. 

మరోవైపు ఎయిర్ పోర్ట్‌లో ఖాళీల భర్తీకి సైతం ఫిబ్రవరి 26నే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో నిర్వహించే నియామక పరీక్ష చివరిరోజు పరీక్షలు కూడా ఫిబ్రవరి 26తో ముగుస్తున్నాయి. 

➥ యూజీసీ నెట్ పరీక్షలను అదేరోజున.

ఇలా ఒకేరోజు అన్ని పరీక్షలు నిర్వహిస్తుండటం అభ్యర్థులకు నష్టమని అభ్యర్థులు వాపోతున్నారు. ఒకేరోజు రాయడం కూడా వీలు కాదని వెల్లడించారు. అందుకే డీఏవో పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. సాధారణంగా ఉద్యోగ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్రీయ నియామక సంస్థలు నిర్వహించే ఉద్యోగ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర స్థాయి ఉద్యో­గాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగరంగ నిపుణులు చెపుతున్నారు. ఒకవేళ ముందస్తుగా రాష్ట్ర నియామక సంస్థలు పరీక్షల తేదీలను ప్రకటిస్తే.. అవసరమైన పక్షంలో అభ్యర్థుల ప్రయోజనాల రీత్యా వాటిని మార్పు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న జరిగే డీఏఓ, పీఆర్‌టీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు డీఏఓ పరీక్ష తేదీలో మార్పు చేయాలని కోరుతున్నారు.

Also Read:

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌, త్వరలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!
తెలంగాణలో మరో ఉద్యోగాల జాతరకు త్వరలోనే సైరన్ మోగనుంది. రాష్ట్రంలో త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు మూసివేయడం లేదన్నారు. భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అవకాశాలు ఉన్నాయన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో 248 ట్రేడ్స్‌మ్యాన్ స్కిల్డ్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నేవీకి చెందిన నావికాదళ యూనిట్లు/ నిర్మాణ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మార్చి 3 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

C-DAC Recruitment: సీడాక్‌లో 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్‌) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 11 Feb 2023 01:00 PM (IST) Tags: TSPSC Exam Dates TSPSC DAO Exam DAO Exam Schedule DAO Exam Postpone DAO Exam Pattern

సంబంధిత కథనాలు

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!

REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!

IITB Jobs: ఐఐటీ బాంబేలో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ పోస్టులు

IITB Jobs: ఐఐటీ బాంబేలో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ పోస్టులు

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు