Indian Navy: ఇండియన్ నేవీలో 248 ట్రేడ్స్‌మ్యాన్ స్కిల్డ్ పోస్టులు, అర్హతలివే!
సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నేవీకి చెందిన నావికాదళ యూనిట్లు/ నిర్మాణ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నేవీకి చెందిన నావికాదళ యూనిట్లు/ నిర్మాణ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మార్చి 3 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు...
* ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 248
ట్రేడులు: మెషినిస్ట్, డ్రైవర్ క్రేన్ మొబైల్, షిప్ రైట్, పెయింటర్, ఫిట్టర్ ఆర్మమెంట్, ఫిట్టర్ జనరల్ మెకానిక్, ఫిట్టర్ ఎలక్ట్రానిక్, ఫిట్టర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రిక్ ఫిట్టర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు ఫీజు: రూ.205 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నేవీ డిపోలు: నావల్ ఆర్మమెంట్ డిపో(ముంబయి), నావల్ ఆర్మమెంట్ డిపో(కార్వార్), నావల్ ఆర్మమెంట్ డిపో(గోవా), నావల్ ఆర్మమెంట్ డిపో(విశాఖపట్నం), నావల్ ఆర్మమెంట్ డిపో(రాంబిలి), నావల్ ఆర్మమెంట్ డిపో(సునాబెడ).
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 06.03.2023.
Also Read:
C-DAC Recruitment: సీడాక్‌లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..