News
News
వీడియోలు ఆటలు
X

TSLPRB Answer Key: వెబ్‌సైట్‌‌లో కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ప్రిలిమినరీ ‘కీ’, అభ్యంతరాలకు అవకాశం!

తెలంగాణలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని పోలీసు నియామక మండలి మే 22న విడుదల చేసింది.ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చు..

FOLLOW US: 
Share:

తెలంగాణలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మే 22న విడుదల చేసింది. కానిస్టేబుల్‌ సివిల్‌, పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్, ఐటీ తత్సమాన పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రోఫార్మాను వెబ్‌ సైట్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. ఫైనల్‌ కీని విడుదల చేసే సమయంలో అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను సైతం వారి లాగిన్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది.

Website

అయితే.. ఈ ప్రాథమిక ‘కీ’లో ఏమైనా అభ్యంతరాలుంటే.. మే 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చు. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రొఫార్మాను అందుబాటులో ఉంచారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదు చేయాలని.. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలని, అభ్యర్థన అసంపూర్తిగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోమని  నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. 

ఏప్రిల్ 30న జరిగిన పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్షకు 1,09,663 మంది (సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు) గానూ, 1,08,055 మంది హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6,801 మందికి గానూ 6,088 మంది హాజరయ్యారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 98.53 శాతం, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 89.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. TSLPRB జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తుది పరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు.

ఆన్సర్ కీ అభ్యంతరాల నమూనా ఇలా..

Also Read:

తపాలా శాఖలో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. దీంతో పాటు మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మే 22 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 23 May 2023 09:41 AM (IST) Tags: Constable Exam ANswer Key Constable Exam Preliminary Key TS Police Constable Exam Key TS Constable Exam Question Papers TS Police Constable Preliminary Exam Key

సంబంధిత కథనాలు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు - అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు -  అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి