అన్వేషించండి

DSC Book Fund: బీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - డీఎస్సీకి సన్నద్ధమయ్యేవారికి 'బుక్‌ ఫండ్‌' - ఎలా పొందాలంటే?

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ గుడ్ న్యూస్ తెలిపింది. బీసీ స్టడీ సర్కిల్‌ అధ్వర్యంలో బుక్‌ ఫండ్‌‌తోపాటు స్టడీ మెటీరియల్‌ ఖర్చును అందించనున్నారు.

TS BC Study Corcle DSC Material: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ అధ్వర్యంలో బుక్‌ ఫండ్‌‌తోపాటు స్టడీ మెటీరియల్‌ ఖర్చును అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 వేల మందికి ఈ సాయాన్ని అందించనున్నారు. ఇందులో 7వేల మంది ఎస్జీటీ అభ్యర్థులకు, 3 వేల మంది స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్‌ ఫండ్‌, స్టడీ మెటీరియల్‌ ఖర్చును అందిస్తారు. ఈ సాయం పొందాలనుకునేవారి.. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలు మించకూడదు. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 040 24071178, 27077929 నంబర్లలో సంప్రదించవచ్చు.

బుక్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోండి..

DSC Book Fund: బీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - డీఎస్సీకి సన్నద్ధమయ్యేవారికి 'బుక్‌ ఫండ్‌' - ఎలా పొందాలంటే?

DSC Book Fund: బీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - డీఎస్సీకి సన్నద్ధమయ్యేవారికి 'బుక్‌ ఫండ్‌' - ఎలా పొందాలంటే?

డీఎస్సీ దరఖాస్తుకు జూన్ 20 వరకు అవకాాశం..

తెలంగాణ ప్రభుత్వం తాజాగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా..  ఏప్రిల్‌ 2 వరకు ఫీజు చెల్లింపు, ఏప్రిల్ 3తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుందని విద్యాశాఖ నోటిఫికేషన్ సమయంలో పేర్కొంది. అయితే తాజాగా టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగించింది. మరోవైపు TS TET - 2024 నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మార్చి 14న విడుదల చేసింది. టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటల్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.

మే 20 నుంచి టెట్, జులై 17 నంచి డీఎస్సీ పరీక్షలు...
అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు డీఎస్సీ (TS DSC)-2024 పరీక్ష తేదీaలను కూడా విద్యాశాఖ ఖరారుచేసింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. టెట్ నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 2 నుంచి జూన్ 20 వరకు పొడిగించారు. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 లాంగ్వేజ్ పండిట్, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సందేహాల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్‌..
డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABPTravis Head vs India | హెడ్ మాస్టర్ ని ఆపగలిగితే Champions Trophy 2025 ఫైనల్ కి మనమే | ABP DesamInd vs Aus Semis 1 Preview | Champions Trophy 2025 లో కంగారూలను టీమిండియా కుమ్మేస్తుందా.? | ABPOscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Ind Vs Aus Semi Final Live Score Update: ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
DVV Danayya Daughter Jahnavi: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
KTR : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
Tamannaah Vijay Varma Breakup: విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
Embed widget