అన్వేషించండి

గురుకుల డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల తుది ఫలితాల వెల్లడి, ఉద్యోగాలకు ఎంపికైంది వీరే

DL Results: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ (DL Results) పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఫిబ్రవరి 28న రాత్రి వెల్లడించింది.

TREIRB DL Results: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ (DL Results) పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఫిబ్రవరి 28న రాత్రి వెల్లడించింది. సబ్జెక్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 793 ఖాళీలకుగాను 600 మందిని ఉద్యోగాలకు ఎంపికచేసింది. ఇక దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. అలాగే.. గురుకులాల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు గురువారం (ఫిబ్రవరి 29న) వెల్లడికానున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు కసరత్తు పూర్తిచేసింది.

తెలంగాణ గురుకుల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్ పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఫిబ్రవరి రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులకు 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించింది. 

గురుకుల డీఎల్ తుది ఎంపిక ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సబ్జెక్టులవారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే..

➥ తెలుగు లెక్చరర్- 55 పోస్టులకు 47 మంది

➥ ఇంగ్లిష్ లెక్చరర్-69 పోస్టులకు 56 మంది

➥ మ్యాథమెటిక్స్  లెక్చరర్- 62 పోస్టులకు 50 మంది 

➥ ఫిజిక్స్ లెక్చరర్- 46 పోస్టులకు 43 మంది

➥కెమిస్ట్రీ లెక్చరర్- 69 పోస్టులకు 62 మంది

➥ మైక్రోబయాలజీ లెక్చరర్ - 17 పోస్టులకు 15 మంది

➥ జువాలజీ లెక్చరర్- 58 పోస్టులకు 44 మంది

➥ బోటనీ లెక్చరర్- 38 పోస్టులకు 33 మంది

➥ జియోలజీ లెక్చరర్- 6 పోస్టులకు 6 మంది

➥ బయోకెమిస్ట్రీ లెక్చరర్- 3 పోస్టులకు ముగ్గురు

➥ బయోటెక్నాలజీ లెక్చరర్- 2 పోస్టులకు ఇద్దరు

➥ సైకాలజీ లెక్చరర్- 6 పోస్టులకు 6 మంది

➥ సోషియాలజీ లెక్చరర్- 7 పోస్టులకు 7 మంది

➥ జర్నలిజం లెక్చరర్- 2 పోస్టులకు ఒక్కరు

➥ కంప్యూటర్ సైన్స్ లెక్చరర్- 99 పోస్టులకు 78 మంది

➥ ఎకనామిక్స్ లెక్చరర్- 25 పోస్టులకు 23 మంది

➥ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్- 14 పోస్టులకు 14 మంది

➥ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్- 9 పోస్టులకు 8 మంది

➥ పొలిటికల్ సైన్స్  లెక్చరర్- 27 పోస్టులకు 23 మంది

➥ కామర్స్ లెక్చరర్ 93 పోస్టులకు 76 మంది

➥ హిస్టరీ లెక్చరర్- 28 పోస్టులకు 24 మంది,

➥ స్టాటిస్టిక్  లెక్చరర్- 58 పోస్టులకు 21 మంది ఎంపికయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించింది. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget