Staff Nurse Recruitment: తుది దశకు 'స్టాఫ్‌నర్సు' పోస్టుల భర్తీ ప్రక్రియ, నియామక ఉత్తర్వులు ఎప్పుడంటే?
తెలంగాణలో స్టాఫ్‌నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరిట్ లిస్ట్ విడుదల చేసి రెండుమూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఎంపికైనవారికి పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు..
Telangana State Staff Nurse Recruitment: తెలంగాణలో స్టాఫ్‌నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరిట్ లిస్ట్ విడుదల చేసి రెండుమూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఎంపికైన వారికి పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బోధనాసుపత్రులతోపాటు వైద్యవిధానపరిషత్, తదితర ఆసుపత్రుల్లో 7,031 మంది స్టాఫ్‌నర్సు పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలోని బీసీ, ఎస్టీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సుమారు 500 మంది రెగ్యులర్ స్టాఫ్‌నర్సుల నియామకం జరుగనుంది.
మొదటగా 5,204 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తర్వాత కొత్తగా 1,827 పోస్టులను జతచేసిన ప్రభుత్వం వీటిని కూడా పాతనోటిఫికేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఖాళీల సంఖ్య మొత్తం 7,031కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా స్టాఫ్ నర్స్ పోస్టులకు మొత్తం 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 2న రాతపరీక్ష నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కేంద్రాల్లో మూడు షిఫ్ట్‌లలో ఉదయం 9 గంటల నుంచి 10.20 గంటల వరకు; 12.30-1.50గంటల వరకు; సాయంత్రం 4గంటల నుంచి 5.20గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆగస్టు 7న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్సర్ 'కీ' అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని డిసెంబరు 18న ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా MHSRB విడుదల చేసింది. మెరిట్ జాబితాపై జనవరి 15 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.
ప్రభుత్వ వైద్య సేవలో అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు చేర్చి వాటికీ మార్కులను కేటాయించారు. వీటి ఆధారంగా ప్రాథమిక మెరిట్ జాబితాను రూపొందించి గతేడాది డిసెంబరు 30 నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. తుది మెరిట్ జాబితాపై అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో జనవరి 14న సాయంత్రం 5 గంటల వరకు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పది రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియకు సుమారు మూడు నెలల అంతరాయం ఏర్పడింది.
వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అదనంగా మరో 1827 పోస్టులను ప్రభుత్వం చేర్చింది.
ALSO READ:
ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఐవో పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజనర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 17, 18 తేదీల్లో టైర్-1 రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..