అన్వేషించండి

TS DSC Application: 11,062 ఉద్యోగాల భర్తీకి మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలో 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న ప్రభుత్వం 'మెగా డీఎస్సీ-2024' నోటిపికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Telangana DSC 2024 Application: తెలంగాణలో 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న ప్రభుత్వం 'మెగా డీఎస్సీ-2024' నోటిపికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన నేపథ్యంలో.. 2023 జులై 1 నాటికి 18  నుంచి 46 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

జూన్ నెలాఖరులో పరీక్షలు..
ఇదిలా ఉండగా.. జూన్ నాటికి నియామకాలు పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం మాత్రం నెరవేరేలా కనిపించడంలేదు. డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది గ్రూప్-1 పరీక్షలకు హాజరవుతుండటమే ఇందుకు కారణం. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించింది. దీంతో గ్రూప్-1 పరీక్ష జరిగేవరకు డీఎస్సీ నిర్వహణ సాధ్యంకాదు. దీంతో జూన్ నెలాఖరులో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. 

10 రోజులపాటు పరీక్షలు..
డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో కనీసం 10 రోజులపాటు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT Posts)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్(School Assistants)-2,629 పోస్టులు,  లాంగ్వేజ్ పండిట్(Laungage Pandi Posts)-727, పీఈటీలు(P.E.T. Posts)-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనరపర్తి (152) ఉన్నాయి.

జిల్లాలవారీగా ఖాళీలు..
TS DSC Application: 11,062 ఉద్యోగాల భర్తీకి మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే?

గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు ప్రభుత్వం ఫిబ్రవరి 28న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటిచే ప్రకటించారు. అంటే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
Pawan Kalyan Temple Tour: అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
Embed widget