అన్వేషించండి

TG GENCO Exam Date: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్ష వివరాలు ఇవే

GENCO Exam Date: జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష తేదీని అధికారులు వెల్లడించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు జులై 14న పరీక్ష నిర్వహించనున్నారు.

TG GENCO Exam Schedule: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE), కెమిస్ట్ (Chemist) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్షల షెడ్యూలును విద్యుత్ శాఖ జూన్ 12న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 14న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు. మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి 10.40 గంటల వరకు మెకానికల్, కెమిస్ట్ విభాగాలకు పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2.40 గంటల వరకు ఎలక్ట్రికల్ విభాగాలకు, సాయంత్రం 5 గంటల నుంచి 6.40 వరకు సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 3 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. 

గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 31న జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే మార్చి 16న లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోసం ఎదురుచూసింది. పరీక్షల నిర్వహణకు ఎన్నికల్ సంఘం నిరాకరిచడంతో.. పరీక్షలను వాయిదావేయాల్సి వచ్చింది. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో రాతపరీక్షల తేదీలను జెన్‌కో యాజమాన్యం ప్రకటించింది.  

అధికారిక వెబ్‌సైట్

TG GENCO Exam Date: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్ష వివరాలు ఇవే

పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్ట్ (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 

తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 5న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలసిందే. దీనిద్వారా 339 ఏఈ పోస్టులు, 60 కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 వసూలుచేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి మినహాయింపు ఇవ్వలేదు.

బాండ్ తప్పనిసరి..
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను తప్పనిసరిగా సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఏడాదికాలం శిక్షణ ఉంటుంది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్‌ కాలంలో ఉద్యోగం మానేస్తే.. నష్టపరిహారం కింద అభ్యర్థుల నుంచి రూ.50,000 వసూలు చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఉద్యోగం వదిలి వెళితే.. రూ.1లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

కెమిస్ట్ పోస్టుల నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Embed widget