అన్వేషించండి

Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!

Tourist Guide Jobs In Telangana: రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో గైడ్‌ల నియామకానికి పర్యాటక శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో పర్యాటక గైడ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
  • చారిత్రక కట్టడాలు, సంస్కృతిపై అవగాహనతో యువతకు ఉపాధి.
  • డిగ్రీతో పాటు చరిత్ర, పురావస్తు శాస్త్రంపై జ్ఞానం తప్పనిసరి.
  • ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు, ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.

Tourist Guide Jobs In Telangana: తెలంగాణ పర్యాటక, పురావస్తు శాఖ రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, సాంస్కృతిక వారసత్వ ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు నైపుణ్యం కలిగిన గైడ్ల అవసరం ఎంతైనా ఉంది. అందుకే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్న పర్యాటక గైడ్ పోస్టుల భర్తీకి, శిక్షణా కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. 

పర్యాటక రంగంలో కేవలం వినోదానికే పరిమితం కాకుండా అది ఒక ప్రాంత చరిత్ర, నాగరికతను ప్రతిబింబిస్తుంది. పర్యాటకులు ఒక చారిత్రక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ కట్టడం వెనుక ఉన్న కథను, దాని నిర్మాణ శైలిని, ప్రాముఖ్యతను వివరించడానికి ఒక సమర్ధుడైన గైడ్ అవసరం. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా పర్యాటకులకు నాణ్యమైన సమాచారాన్ని అందించడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 

 

అర్హతలు ఏంటీ?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం విద్యార్హత మాత్రమే కాకుండా, అభ్యర్థులకు ఈ వివిధ రంగాల్లో ప్రత్యేక ఆసక్తి, అవగాహన ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులకు చరిత్ర, పురావస్తు శాస్త్రంపై పట్టు ఉండాలి. మన పూర్వీకుల జీవన విధానం, పురాతన శిలాశాసనాలపై జ్ఞానం ఉండాలి. కోటలు, రాజభవనాలు, పురాతన కట్టడాల పరిరక్షణ తెలిసి ఉండాలి. స్థానిక పండుగలు, నృత్యరూపాలు, హస్తకళలు గురించి తెలిసి ఉండాలి. కట్టడాల నిర్మాణ శైలి, ఇంజనీరింగ్ అద్బుతాలు గురించి పరిజ్ఞానం ఉండాలి. 

ఈ ఉద్యోగంలో కమ్యూనికేషన్ స్కిల్ అత్యంత కీలకం. భాషా నైపుణ్యం కలిగి ఉండి, పర్యాటకులతో మర్యాదగా, స్పష్టంగా మాట్లాడగలిగే వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కథలను వివరించే నైపుణ్యం అదనపు బలంగా మారుతుంది. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం గూగుల్ ఫామ్ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అభ్యర్థులు మత విద్యార్హత, ధృవీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. 

Frequently Asked Questions

తెలంగాణలో పర్యాటక గైడ్ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందిన అభ్యర్థులు, చరిత్ర, పురావస్తు శాస్త్రం, స్థానిక సంస్కృతిపై ఆసక్తి మరియు అవగాహన ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పర్యాటక గైడ్ ఉద్యోగాలకు ఏ విధమైన నైపుణ్యాలు అవసరం?

చరిత్ర, పురావస్తు శాస్త్రం, స్థానిక పండుగలు, హస్తకళలు, కట్టడాల నిర్మాణ శైలిపై జ్ఞానం అవసరం. అలాగే, అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు భాషా నైపుణ్యాలు, పర్యాటకులను ఆకట్టుకునేలా కథలు చెప్పే సామర్థ్యం ముఖ్యం.

తెలంగాణలో పర్యాటక గైడ్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆసక్తి గల అభ్యర్థులు ప్రభుత్వం అందించిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన విద్యార్హత, ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.

ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

పర్యాటక శాఖ రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పడానికి నైపుణ్యం కలిగిన గైడ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా దీని లక్ష్యం.

టాప్ హెడ్ లైన్స్

IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Charmilla Nalluru: శ్రీలంకలో కొత్త యాంకర్ ఛర్మిల... షికారులో అందాల భామ
శ్రీలంకలో కొత్త యాంకర్ ఛర్మిల... షికారులో అందాల భామ
Embed widget