అన్వేషించండి

TSPSC: టీఎస్‌పీఎస్సీ డీఏవో, హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

తెలంగాణలో డివిజనల్ అకౌంట్స్ అధికారి (DAO), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష నిర్వహణ తేదీలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

TSPSC DAO EXAM DATES: తెలంగాణలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఇందులో డివిజనల్ అకౌంట్స్ అధికారి (DAO), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణ తేదీలను కమిషన్ వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం DAO పోస్టులకు వచ్చే జూన్ 30న, వార్డెన్ పోస్టులకు జూన్ 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మార్చి 13న ప్రకటించింది. 

డీఏఓ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (అరిథ్‌మెటిక్) పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఇక హాస్టల్ వెల్ఫేర్ అధికారి(వార్డెన్) పోస్టులకు దరఖాస్తు చేసినవారికి జూన్ 24 నుంచి పరీక్షలు ప్రారంభిస్తామన్నారు. వీరికి పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (సబ్జెక్టు సంబంధిత) పరీక్షలు ఉంటాయి. ఏ రోజు ఏ పోస్టుకు పరీక్ష ఉంటుందనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. దరఖాస్తుదారులకు హాల్‌టిక్కెట్లను పరీక్ష తేదీలకు వారం ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.

డీఏవో పోస్టుల వివరాలు..
తెలంగాణలో 53 డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గతేడాది ఫిబ్రవరి 20న రాతపరీక్ష హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించింది. కాగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో) పరీక్షను వాయిదావేసింది. తాజాగా పరీక్షల రీషెడ్యూలు తేదీని టీఎస్‌పీస్సీ వెల్లడించింది. జూన్ 30న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

* డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ (గ్రేడ్-2): 53 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 అరిథ్‌మెటిక్ & మెన్సురేషన్ నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

పే స్కేలు: రూ.45,960- రూ.1,24,150.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.

* హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పోస్టుల వివరాలు..

తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 581

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -1): 05 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు: 70
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్): 228
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.

➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (): 140
విభాగం: బీసీ వెల్ఫేర్.

➥ వార్డెన్ (గ్రేడ్ -1): 05
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ మ్యాట్రన్ (గ్రేడ్ -1): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ వార్డెన్ (గ్రేడ్-2): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ మ్యాట్రన్ (గ్రేడ్-2): 02
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.

➥ లేడి సూప‌రింటెండెంట్: 19
విభాగం: చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో ఉంటాయి.  

TSPSC: టీఎస్‌పీఎస్సీ డీఏవో, హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

TSPSC: టీఎస్‌పీఎస్సీ డీఏవో, హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

TSPSC: టీఎస్‌పీఎస్సీ డీఏవో, హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Madanapalle kidney Scam: పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
Advertisement

వీడియోలు

SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Chinnaswamy Stadium RCB | 2026లో  చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Madanapalle kidney Scam: పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
Priyanka Chopra - Globetrotter First Look: మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
Patanjali Gurukulam: తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
Bank Loan on Silver Jewelry:  వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చరచ్చ  కొట్టకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు 
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చరచ్చ  కొట్టకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు 
Embed widget