By: ABP Desam | Updated at : 11 May 2022 04:59 PM (IST)
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు (Photo Credit: Twitter/TelanganaHealth)
Telangana Jobs Notification of 13000 vacancies in the Health Department తెలంగాణలో ఇటీవల పోలీసు ఉద్యోగాలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తరువాత రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన తరువాతే వరుస నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. నిరుద్యోగులకు తాజాగా మంత్రి హరీష్ రావు మరో శుభవార్త అందించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని, త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంతగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచామన్నారు. వైద్యారోగ్య శాఖ బడ్జెట్‌ను డబుల్ చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
నార్సింగ్ లో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్, మొబైల్ యాప్ ను ప్రారంభించిన వైద్యారోగ్య శాఖామంత్రి శ్రీ హరీష్ రావు గారు. కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్, వైద్య అధికారులు పాల్గొన్నారు pic.twitter.com/vMw8BRQZSU
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 11, 2022
టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఉచితంగా 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. భవిష్యత్‌లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో 137 పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డాక్టర్లు మెడిసిన్స్ బయటకు రాసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్ (ANMS in Telangana)లు ఇంటి వద్దకే వచ్చి టెస్టులు చేస్తున్నారని, మెరుగైన పాలనకు ఇది నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సమయానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే కాన్పులు ఉన్నాయని, ఈ ఏడేండ్లలో 56 శాతం పెరిగాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేద్దామని, అధికారులు, ఉద్యోగులు ఈమేరకు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా వీలున్నప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని, సౌకర్యాలను ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
Also Read: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షా ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు