Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
Best Budget Cars in India: భారతదేశంలో రూ.10 లక్షల్లోపు ధరలో కొన్ని మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాటా నుంచి మారుతి వరకు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Cars Under 10 Lakh: ప్రస్తుతం మనదేశంలో కారు కొనడం అనేది చాలా పెద్ద పని. కొత్త కారును కొనుగోలు చేసే ముందు, మీరు దాని ఫీచర్ల గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. కారు లుక్ అనేది చూస్తే తెలుస్తుంది. కానీ ఆ కారు ఎంత మైలేజ్ ఇస్తుందో లేదా కారులో ప్రయాణం ఎంత సురక్షితమో అనేది ఆ కారు గురించిన వివరాలు తెలుసుకున్న తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు మనం రూ. 10 లక్షల రేంజ్‌లో ఉండే బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం. ఈ కార్లలో సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఈ కార్లు మెరుగైన మైలేజీని కూడా ఇస్తాయి.
టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్‌లో 5500 సీసీ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్‌తో టాటా నెక్సాన్ 88.2 పీఎస్ శక్తిని, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 382 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఈ టాటా కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. లీటరుకు 17 నుంచి 24 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.
ఈ టాటా కారులో సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. ఈ కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా అందించారు. టాటా నెక్సాన్‌కు సంబంధించి మొత్తం 100 వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV 3XO)
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులోని డీజిల్ ఇంజన్ 86 కేడబ్ల్యూ పవర్, 300 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. ఈ కారు పెట్రోల్ ఇంజన్ 96 కేడబ్ల్యూ పవర్, 230 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.
మహీంద్రా 2024లో భారత దేశంలో లాంచ్ చేసిన ఈ కారు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. లాంచ్ అయ్యాక దీనిపై విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఈ కారు ఇటీవల భారత్ ఎన్‌క్యాప్ నుంచి క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. ఈ కారుకు సంబంధించిన అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. మహీంద్రా కారులో స్కైరూఫ్ ఫీచర్ కూడా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మారుతి డిజైర్ (Maruti Dzire)
మారుతి డిజైర్ అప్‌డేటెడ్ మోడల్ ఇటీవల మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు ఏడు కలర్ వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. కొత్త డిజైర్ క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన మొదటి మారుతి కారుగా నిలిచింది. ఈ మారుతి కారులో సన్‌రూఫ్ కూడా ఉంది.
మారుతి కారులో 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్ అమర్చారు. దీంతో పాటు ఈ కారు సీఎన్‌జీలో కూడా అందుబాటులో ఉంది. మారుతి డిజైర్ పెట్రోల్ వేరియంట్‌లో 24.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దాని సీఎన్‌జీ కారు 33.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది. కొత్త డిజైర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: కోటి రూపాయల వోల్వో ఎక్స్‌సీ90 - ఈఎంఐలో కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి?