అన్వేషించండి

TS Groups Interviews : యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్, గ్రూప్స్ ఇంటర్వ్యూలపై కీలక నిర్ణయం

TS Groups Interviews : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తొలగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TS Groups Interveiws : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తాజాగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కూడా కేబినెట్‌ శుభవార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

TS Groups Interviews : యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్, గ్రూప్స్ ఇంటర్వ్యూలపై కీలక నిర్ణయం

యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీకి కేబినెట్ ఆమోదం

వీటితో మరిన్ని కీలకనిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేబినెట్ భేటీ ముగిసిన సీఎం కేసీఆర్ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. అన్ని యూనివ‌ర్సిటీల్లో క‌లిపి దాదాపు 3,500 పైగా ఖాళీలున్నాయ‌న్నారు. కామ‌న్ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయ‌నం చేసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూనివ‌ర్సిటీల్లో టీచింగ్‌, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఖాళీల వివరాలు సేకరించి త్వరలో భ‌ర్తీ చేస్తామన్నారు. ఈ నియామ‌కాలు పార‌ద‌ర్శకంగా చేప‌ట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఇంటర్వ్యూలు రద్దు

 గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్వ్యూలు ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఇంటర్వ్యూకి వంద మార్క్ లు, గ్రూప్ 2 లో ఇంటర్వ్యూ కి 75 మార్కులు ఉండేవి.  సమయం ఆదాతో పాటు అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకే ఇంటర్వ్యూలు ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్ట్ ల్లో ఈ రెండింటికీ ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటల్లో ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వీటిల్లో 503 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ, గ్రూప్ 2 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇంటర్వ్యూలపై క్లారిటీ వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Also Read : Telangana CM KCR Press Meet: వరి రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ - రాష్ట్ర ప్రభుత్వం తరఫున వడ్లు కొనుగోలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget