IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Telangana CM KCR Press Meet: వరి రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ - రాష్ట్ర ప్రభుత్వం తరఫున వడ్లు కొనుగోలు

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. 24 గంటల గడువు తర్వాత ప్రెస్‌ మీట్‌ పెట్టిన కేసీఆర్‌... మోదీని, బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

FOLLOW US: 

వరి రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రప్రభుత్వం తరఫున వడ్లు కొనేందుకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. యాసంగిలో ప్రతి గింజ కొంటామమన్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 

ఏ రైతు కూడా తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దన్నారు కేసీఆర్. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలో నలుగురు సభ్యులను నియమించారు. ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు కేసీఆర్. 

వరి విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో కూర్చొని ఉందన్నారు కేసీఆర్. ఏడాది పాటు రైతులు ధర్నాలు చేస్తే వారిని తూలనాడి చివరకు ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. వ్యవసాయన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించాలని కేంద్రం ప్రయత్నమన్నారు. రైతులను ఆయా కంపెనీల్లో కూలీలుగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ధాన్యం కొనుగోలు విషయంలో మంత్రి వద్దకు వెళ్తే.. రైతులకు నూకలు తినే అలవాటు చేయాలని చెప్పడం పియూష్‌ గోయల్‌ అహంకారానికి నిదర్శనమన్నారు కేసీఆర్. తెలంగాణ సాధించిన విజయాలు చూస్తూ తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆ మంత్రికి కనీసం బుద్దైనా ఉందా అంటు ధ్వజమెత్తారు.

కేంద్రానికి పాలన చేతక కాక ఇలాంటి వంకలు పెడుతోందన్నారు కేసీఆర్. వేల టన్నుల బాయిల్డ్ రైస్‌ ఎగుమతి చేసి ఇప్పుడు అబద్దాలు చెప్తున్నారన్నారు. యాసంగి పంటలో నూకల శాతం ఎక్కువ ఉంటుందన్నారు. దీన్నే కేంద్రం సమస్యగా చూపిస్తోందన్నారు. ఈ పంటలు తీసుకొని వచ్చే లాస్‌ను కేంద్రం భరించాలన్నారు. దాన్ని భరించలేక ఇప్పుడు కొర్రీలు పెడుతోందన్నారు. 

తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై పెంచలేదన్నారు. కానీ కేంద్రం రోజూ పెంచుతోందన్నారు. దీన్ని తగ్గించమంటే రాష్ట్రాలు తగ్గించాలని ఎదురు దాడి చేస్తున్నారన్నారు. బలమైన కేంద్రం బలహీనమై రాష్ట్రాలు అన్న విధానంతో బీజేపీ పాలిస్తోందన్నారు. కేంద్రం పెంచకుండా తగ్గించమండే ఇదెక్కడి నీతి. 

ఇదే మాదిరిగా వరిలోనూ చూపిస్తున్నారు. 30 శాతం నూకల శాతం నష్టాన్ని భరించడం ఇష్టం లేకుండా ఇలా చేస్తున్నారన్నారు కేసీఆర్. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నామని తెలిసి కూడా విమర్శలు చేస్తున్నారు. ఇది మీ బాధ్యత అని తెలిసి కూడా మేం గుర్తు చేస్తున్నామన్నారు. అందుకే గట్టిగా అడుగుతున్నామన్నారు. భారత్‌ ప్రజల ముందు మోదీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. అందుకే దిల్లీలో ధర్నా చేశామన్నారు. 

అదానీకి పన్నెండు వేల కోట్లు మాఫీ చేశారు కానీ రైతులకు రూపాయి ఇవ్వడానికి మాత్రం మోదీ ప్రభుత్వానికి చేతకాదన్నారు కేసీఆర్. బ్యాంకులను మోసం చేసి దేశాలు దాటి వెళ్లిపోతుంటే వాళ్లకు సహాయం చేస్తున్నారని సంచనల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. త్వరలోనే బయటపెడతామన్నారు కేసీఆర్. 

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశం చాలా రంగాల్లో కుంగిపోయిందన్నారు కేసీఆర్. అన్నింటిని నాశనం చేసి ఏదైనా వస్తే లేనిపోని మత విధ్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందే డ్రామాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో శ్రీరామ నవమి సందర్భంగా రెచ్చగొట్టే పనులు చేశారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో హిజాబ్, హలాల్‌ ఇలా చాలా వాటిని నిషేధించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేధావులు కొట్టుకుపోతే కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందన్నారు కేసీఆర్. కచ్చితంగా ఇండియా ప్రజలు గిల్లి పడేస్తుందన్నారు. ఇవాళ అహంకారపూరితంగా మాట్లాడి నడిపిస్తామనుకుంటే నడవదన్నారు. భారత దేశ రైతులకు దిక్కూ దివానా లేకుండా పోయిందన్నారు. కనీస ధర ఇస్తూ ఒక ఐక్య పాలసీ రావాలన్నారు కేసీఆర్. దేశవ్యాప్తంగా మేధావులు, రైతు సంఘాల నేతలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు కేసీఆర్.   

సమైక్య రాష్ట్రంలో పూర్తిగా ధ్వంసమైన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రగతిలోకి తీసుకొచ్చిందన్నారు కేసీఆర్. గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా కార్యక్రమాలు తీసుకున్నామన్నాని తెలిపారు. వ్యవసాయంలో అనేకి ఉద్దీపనలు సమకూర్చామని వివరించారు. అందులో నీళ్లు సంవృద్దిగా ఇచ్చాం. విద్యుత్‌ 24 గంటలపాటు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. 

మిషన్‌ కాకతీయ అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు కేసీఆర్. ఇండియాలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్రం చెప్పిందన్నారు.  విద్యుత్‌ విషయంలో కూడా మంచి ఫలితాలు సాధించాం. రాబోయే రోజుల్లో 5600 మెగా వాట్స్‌ 2023లో మనకు అందుబాటులోకి రాబోతోందన్నారు. 

వీటి వల్ల తెలంగాణలో గొప్ప పంటలకు నెలవుగా మారింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలకు తోడు ప్రకృతి సహకరించి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల వరకు పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. పంటలు కూడా బాగా పండుతున్నాయన్నారు. 

జీవో నెంబర్‌ 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించినట్టు కేబినెట్‌ వివరాలు వెల్లడించిన కేసీఆర్‌ తెలిపారు. దీని వల్ల ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కేసీఆర్. మే 20 నుంచి జూన్ 5 వరకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిర్వహించాలని తేల్చారు. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

యూనివర్శిటీల్లో 3వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. దీని కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్‌ బోర్డు పెట్టి ఫిల్ చేయాలని నిర్ణయించారు. అదే టైంలో ఆరు యూనివర్శిటీలకు కేబినెట్‌ ఆమెదించారు. 

 

Published at : 12 Apr 2022 06:45 PM (IST) Tags: cm kcr Modi Telangana CM KCR Paddy Procurement KCR on BJP

సంబంధిత కథనాలు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో  - ఎవరికంటే?

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

Business Idea: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!

Business Idea: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!

LIC Home Loan: తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ కావాలా? ఈ ఒక్కటీ ఉంటే LIC ఇచ్చేస్తోంది!

LIC Home Loan: తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ కావాలా? ఈ ఒక్కటీ ఉంటే LIC ఇచ్చేస్తోంది!