అన్వేషించండి

గురుకుల ఒప్పంద ఉపాధ్యాయులకు తీపికబురు, క్రమబద్ధీకరణకు ప్రభుత్వ ఆమోదం

రాష్ట్రంలోని ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. 

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించించింది. రాష్ట్రంలోని ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు 567 మంది ఒప్పంద టీచర్ల క్రమబద్ధీకరణ దస్త్రంపై శుక్రవారం(ఆగస్టు 25) సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. 

గత 16 ఏళ్లుగా ఒప్పంద టీచర్లు గురుకులాల్లో పనిచేస్తున్నారు. ఇటీవల జనరల్‌ గురుకుల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న 137 మంది సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరించి, ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఎస్సీ గురుకులాల్లో టీచర్లను రెగ్యులరైజ్‌ చేసిన ప్రభుత్వం రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎస్సీ సంక్షేమ గురుకులాల ఒప్పంద ఉపాధ్యాయుల సర్వీసును సీఎం కేసీఆర్‌ క్రమబద్ధీకరించడం పట్ల ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మెరుగైన విద్యను అందిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్రం అన్నారు.

ALSO READ:

టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ
తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డీఎస్సీ ద్వారానే టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 5,089 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది. ఈసారి జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టెట్‌లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులని తెలిపారు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారని చెప్పారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయని తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌లో 875 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌ లిమిటెడ్ డబ్ల్యూసీఎల్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 875 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మజగావ్‌డాక్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 531 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 531 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vikatakavi Web Series: 'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
Embed widget