Mega DSC Dates: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణ డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC) పరీక్షకు తేదీలు ఖరారయ్యారు. డీఎస్సీ పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
Telangana DSC Exams Schedule: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC)-2024 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు డీఎస్సీ పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోవైపు డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఎస్సీ రాసేందుకు టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మందికి ఊరట లభించే అవకాశం ఉంది.
తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 2లోపు నిర్ణీత ఫీజు చెల్లించి, మార్చి 3న రాత్రి 11.50లోపు దరఖాస్తులు సమర్పించాాలి. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 లాంగ్వేజ్ పండిట్, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.
డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో.. కనీసం 10 రోజులపాటు పరీక్షలు జరుగనున్నాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, డగఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.