తెలంగాణ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదిక టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Recruitment of Teaching Faculties:
తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదిక టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు విధానంలో పనిచేసేవారికి రెగ్యులర్ ఉద్యోగులకన్నా అధిక వేతనం ఇవ్వనున్నారు. వీరందర్నీ కేవలం ఏడాది కోసం తీసుకుంటున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పెంచుతారు. రెగ్యులర్ నియామకాలు చేపడితే తొలగిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు బాండ్ పేపర్ రాసివ్వాలి. ఒకవేళ మధ్యలో ఉద్యోగాన్ని వదిలేస్తే మూడు నెలల జీతాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. జాయినింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు...
➥ ప్రొఫెసర్
➥ అసోసియేట్ ప్రొఫెసర్
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్.ఖాళీలున్న కళాశాలలు: వికారాబాద్, జనగామ, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు బోధన, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 05.10.2023 నాటికి 69 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు, తమ ధ్రువపత్రాలను స్కాన్ చేసి మెయిల్ ద్వారా పంపాలి.
ఎంపిక విధానం: పీజీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
జీతం: ప్రొఫెసర్ పోస్టులకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1.25 లక్షలు చెల్లిస్తారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50,000 ఇస్తారు.
E-Mail: dmerecruitment.contract@gmail.com
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 15.10.2023.
➥ కౌన్సెలింగ్ నిర్వహణ: 20.10.2023.
➥ ఎంపికైన అభ్యర్థుల జాయినింగ్ రిపోర్టు: 01.11.2023.
Notification & Application:
ALSO READ:
టీఎస్‌జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తులు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌జెన్‌కోలో 60 కెమిస్ట్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 60 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంట వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..