అన్వేషించండి

TSGENCO: టీఎస్‌జెన్‌కోలో 60 కెమిస్ట్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

టీఎస్‌జెన్‌కోలో కెమిస్ట్ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 60 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంట వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష ఆధారంగా ఎంపికలు చేపడతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ (జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ) పరిధిలో డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైవారికి నెలకు రూ.65,600 - రూ.1,31,220 వరకు జీతభత్యాలు అందుతాయి.

ఉద్యోగాలకు ఎంపికైనవారు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయనున్నట్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. రెండళ్లే ప్రొబేషన్ పీరియడ్‌లో ఉద్యోగం వదిలి వెళితే, నష్టపరిహారం కింద అభ్యర్థుల నుంచి రూ.50,000 వసూలు చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఉద్యోగం వదిలి వెళితే.. రూ.1లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు..

* కెమిస్ట్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 60 (లిమిటెడ్-03, జనరల్-57)

అర్హత: ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు మినహాయింపు వర్తించదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 

పేస్కేలు: రూ.65,600 - రూ.1,31,220 వరకు ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.10.2023. (11.00 AM)

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.10.2023. (01.00 PM)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.10.2023. (11.59 PM).

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 01.11.2023 (10:00 AM ) - 02.11.2023 (5:00 PM)

➥ రాతపరీక్ష హాల్‌టికెట్లు: పరీక్షకు వారం ముందు నుంచి.

➥ రాతపరీక్ష తేది: 03.12.2023.

Notification

Online Application

Website

                  

ALSO READ:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC Job Notifications: ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget