అన్వేషించండి

TMB Recruitment: తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో క్రెడిట్ అనలిస్ట్, ఆఫీసర్ పోస్టులు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ అనలిస్ట్, చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా బ్యాంకు శాఖల్లో క్రెడిట్ అనలిస్ట్, చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 13 చివరితేదీగా నిర్ణయించారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వివరాలు..

1) క్రెడిట్ అనలిస్ట్ (స్కేల్-2)

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(ఫైనాన్స్, అకౌంటింగ్) ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఎంబీఏ, సీబీసీఏ ప్రోగ్రామ్ అర్హతలున్నవారికి ప్రాధాన్యం.

అనుభవం: 2 సంవత్సరాలు.

వయసు: 30.06.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.

2) చీఫ్ రిస్క్ ఆఫీసర్

అర్హతలు..

* సీఎఫ్‌ఏ ఇన్‌స్టి్ట్యూట్ నుంచి చార్టర్ అవార్డు పొందిన ఛార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అయి ఉండాలి. (లేదా) ఐసీఏఐ బోర్డు గుర్తింపు పొందిన ఛార్టర్ట్ అకౌంటెంట్ అయి ఉండాలి. (లేదా) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ అర్హత ఉండాలి.

* డిగ్రీతోపాటు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ (ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్) ఉండాలి. (లేదా) పీఆర్‌ఎంఐఏ ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేట్ ఉండాలి.

అనుభవం: 2 సంవత్సరాలు.

వయసు: 30.06.2023 నాటికి 60 సంవత్సరాలకు మించకూడదు.

3) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్

అర్హతలు..

* నిబంధనల మేరకు విద్యా్ర్హతలు ఉండాలి.

అనుభవం: బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగాల్లో 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాలు ప్లానింగ్/బిజినెస్ డెవలప్‌మెంట్/అడ్వాన్సెస్/ కంప్లయన్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు: 55 సంవత్సరాలలోపు ఉండాలి. 

4) చీఫ్ మేనేజర్-క్రెడిట్

అర్హత: డిగ్రీ/పీజీ డిగ్రీతోపాటు సీఏ/సీఎఫ్‌ఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ.

అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.

వయోపరిమితి: 31.5.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 13.08.2023.

Credit Analyst Posts:
Notification
Online Application

Chief Risk Officer:
Notification
Online Application

Chief Operating Officer (COO):
Notification
Online Application

Chief Manager - Credit:
Notification
Online Application

Website

ALSO READ:

1207 'స్టెనోగ్రాఫ‌ర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2023 ప్రక‌ట‌న‌ను ఆగస్టు 2న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget