అన్వేషించండి

SBI Clerk Admit Card: వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు.

ఎస్‌బీఐ క్లర్క్-2022 మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. జనవరి 15 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 15న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

మెయిన్ ఎగ్జామ్ హాల్‌‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

మెయిన్ ఎగ్జామ్ పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. మొత్తం 190  ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్  50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్  అప్టిట్యూడ్  50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్  అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.

SBI Clerk Admit Card: వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:  అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.  

SBI Clerks 2022 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

ఎస్‌బీఐలో 1438 ఉద్యోగాలు, వీరికి బంపరాఫర్! నెలకు రూ.40 వేల వరకు జీతం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. 2023, జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వరంగల్‌ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్  స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్  స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Kamareddy Crime News: కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
Embed widget