SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు - పూర్తి వివరాలివే!
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

SBI Recruitment: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్(మేనేజర్, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 42
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ మేనేజర్(డేటా సైంటిస్ట్): 13 పోస్టులు
గ్రేడ్/స్కేల్: మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-III
➤ రెగ్యులర్- 12 పోస్టులు ( ఎస్సీ- 01, ఎస్టీ- 0, ఓబీసీ- 03, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 07)
➤ బ్యాక్‌లాగ్- 01 పోస్టు(ఎస్టీ- 01)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంటెక్( కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్), ఎంఎస్సీ(డేటా సైన్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ(స్టాటిస్టిక్స్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంబీఏ, పీజీడీఎంతో పాటు స్పెషలైజేషన్(ఫైనాన్స్) అండ్ ఎంఎల్/ఏఐ/నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, వెబ్ క్రాలింగ్ మరియు న్యూరల్ నెట్‌వర్క్‌లలో ఏదైనా సర్టిఫికేషన్ గల వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 31.07.2024 నాటికి 26 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.85,920 - రూ.1,05,280 వరకు చెల్లిస్తారు.
⏩ డిప్యూటీ మేనేజర్(డేటా సైంటిస్ట్): 29 పోస్టులు
గ్రేడ్/స్కేల్: మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-II
➤ రెగ్యులర్- 28 పోస్టులు ( ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఓబీసీ- 07, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 13)
➤ బ్యాక్‌లాగ్- 01 పోస్టు(ఎస్టీ- 01)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంటెక్( కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్), ఎంఎస్సీ(డేటా సైన్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ(స్టాటిస్టిక్స్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంబీఏ, పీజీడీఎంతో పాటు స్పెషలైజేషన్(ఫైనాన్స్) అండ్ ఎంఎల్/ఏఐ/నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, వెబ్ క్రాలింగ్ మరియు న్యూరల్ నెట్‌వర్క్‌లలో ఏదైనా సర్టిఫికేషన్ గల వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 31.07.2024 నాటికి 24 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.64,820 - రూ.93,960 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్‌లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ వివరాలు..
➥ రీసెంట్ ఫొటోగ్రాఫ్.
➥ సంతకం.
➥ సంక్షిప్త రెజ్యూమ్ (పీడీఎఫ్).
➥ ఐడి ప్రూఫ్ (పీడీఎఫ్).
➥ పుట్టిన తేదీకి సంబంధించిన ప్రూఫ్ (పీడీఎఫ్).
➥ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేషన్ (వర్తిస్తే) (పీడీఎఫ్).
➥ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్-షీట్‌లు/ డిగ్రీ సర్టిఫికేట్(పీడీఎఫ్).
➥ ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికెట్లు(పీడీఎఫ్).
➥ ఫారం-16/ఆఫర్ లెటర్/ప్రస్తుత యజమాని నుంచి తాజా జీతం స్లిప్ (పీడీఎఫ్).
➥ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (వర్తిస్తే) (పీడీఎఫ్).
దరఖాస్తు చేయడం ఎలా..
➥ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers/current-openings లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి.
➥ క్రిందికి స్క్రోల్ చేసి సంబంధిత ప్రకటనపై క్లిక్ చేయండి.
➥ నోటిఫికేషన్ నంబరు. CRPD/SCO/2024-25/27 డౌన్‌లోడ్ చేసుకోండి.
➥ అభ్యర్థులు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
➥ తుది సమర్పణకు ముందు, అభ్యర్థలు తమ దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించండి.
➥ తుది సమర్పణ తర్వాత సవరణలు అనుమతించబడవు.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.02.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

