SSC MTS Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ తుది ఫలితాలు వెల్లడి, 3887 మంది అభ్యర్థులు ఎంపిక!
ధ్రువపత్రాల పరిశీలన తర్వాత మొత్తం 3887 మంది అభ్యర్థులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తుది ఎంపికచేసింది. వీరిలో ఈడబ్ల్యూఎస్-300, ఎస్సీ-348, ఎస్టీ-290, ఓబీసీ-1138, జనరల్-1811 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
![SSC MTS Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ తుది ఫలితాలు వెల్లడి, 3887 మంది అభ్యర్థులు ఎంపిక! Staff Selection Commission Multi Tasking (Non-Technical) Staff Examination 2020: Declaration of Final Result, check Here SSC MTS Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ తుది ఫలితాలు వెల్లడి, 3887 మంది అభ్యర్థులు ఎంపిక!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/75c86ce7b1fb7e71bc59bf00be740fb91665856163756522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 15న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం మల్టీటాస్కింగ్ స్టాఫ్ పేపర్-2 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పేపరులో అర్హత సాధించిన మొత్తం 9754 మంది అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎంపికయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులందరి మార్కుల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది.
ధ్రువపత్రాల పరిశీలన తర్వాత మొత్తం 3887 మంది అభ్యర్థులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తుది ఎంపికచేసింది. వీరిలో కేటగిరీలవారీగా ఈడబ్ల్యూఎస్-300, ఎస్సీ-348, ఎస్టీ-290, ఓబీసీ-1138, జనరల్-1811 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మొత్తం అభ్యర్థుల్లో 18-25 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు 3196 మంది ఉండగా.. 18-27 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు 691 మంది ఉన్నారు. ఎంపికైనవారిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విధుల్లో నియమిస్తారు.
తుది ఫలితాల్లో 3865 అభ్యర్థుల వివరాలను మాత్రమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. 30 మంది అభ్యర్థుల ఫలితాలను పలు కారణాల చేత పెండింగ్‌లో ఉంచింది. ఒకవ్యక్తిని డీబార్ చేసినట్లు కమిషన్ పేర్కొంది.
* SSC MTS Tier 1 Result ఇలా చూసుకోండి..
Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - ssc.nic.in.
Step 2: అక్కడ హోంపేజీలో SSC MTS ఫలితాలకు సంబంధించిన టాబ్ మీద క్లిక్ చేయాలి.
Step 3: SSC MTS Final Result 2020 లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 4: SSC MTS 2020 తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది.
Step 5: అభ్యర్థులు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫలితాలు చూసుకోవచ్చు.
SSC MTS Result 2020 List-1
SSC MTS Result 2020 List-2
కటాఫ్ మార్కులు, ఫలితాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
:: ఇవీ చదవండి ::
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, అర్హతలివే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 534 నాన్-టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
NTPC Jobs: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్-2022 పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సరైన అర్హత ఉన్నవారు నవంబరు 11లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)