(Source: ECI/ABP News/ABP Majha)
SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే
Staff Selection Commission Jobs: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్, జూన్ నెలల్లో నిర్వహించనున్న నియామక పరీక్షల తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్పులు చేసింది.
SSC Revised Exam Dates: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్, జూన్ నెలల్లో నిర్వహించనున్న నియామక పరీక్షల తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్పులు చేసింది. దేశంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. పరీక్షల తేదీల్లో ఈ మార్పులు చేసినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 8న అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఆయా సమయాల్లో నిర్వహించే పరీక్షల తేదీల్లో కొత్త తేదీలను ప్రకటించింది. పలు పరీక్షల రీషెడ్యూలు తేదీలతోపాటు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(CHSL)-2024 పరీక్ష తేదీని స్టాప్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.
కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..
➥ జూన్ 4, 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిన జూనియర్ ఇంజినీర్ పేపర్-1 పరీక్షను జూన్ 5, 6 7 తేదీల్లో నిర్వహించనున్నారు.
➥ మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన సెలక్షన్ పోస్టుల పరీక్ష (ఫేజ్ – XII) పేపర్-1 పరీక్షను జూన్ 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్నారు.
➥ మే 9, 10, 13ల్లో జరగాల్సిన ఢిల్లీ పోలీస్ (ఎస్ఐ, సీఏపీఎఫ్) పేపర్-1 పరీక్షను జూన్ 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.
➥ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL)-2024 పేపర్-1 పరీక్షను జులై 1 - 5 వరకు, జులై 8 - 12 వరకు నిర్వహించనున్నారు.
సీహెచ్‌ఎస్‌ఎల్-2024 సంక్షిప్త ప్రకటన విడుదల..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024’ (CHSL) నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. ఈ మేరకు ఇప్పటికే సంక్షిప్త ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు, 18-27 ఏళ్ల మధ్య వయసున్న వారు CHSL పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 పరీక్షలు, కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు భర్తీచేస్తారు. ఖాళీలు, దరఖాస్తు తేదీలతో పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. గతేడాది 1,600 ఖాళీలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ:
టీసీఎస్ 'నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ - 2024', ఒక్క పరీక్షతో వేలాది ఉద్యోగాలు
నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 'డిజిటల్ హైరింగ్'కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆఫ్ క్యాంపస్ కోసం టీసీఎస్ ఎన్‌క్యూటీ (TCS NQT) పరీక్షకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారు టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో, ఏసియన్ పెయింట్స్ సహా దాదాపు 3 వేల ఐటీ, ఐటీయేతర కార్పొరేట్ సంస్థల్లో దాదాపు 1.6 లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి గరిష్ఠంగా రూ.19 లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందవచ్చు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే.. ఆయా సంస్థలుఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..