SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
SSC: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో 1,324 జూనియర్ ఇంజినీర్ నియామకాలకు సంబంధించి 'టైర్-2' పరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 30న విడుదల చేసింది.
SSC JE Admitcard: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) 1,324 జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) నియామకాలకు సంబంధించి 'టైర్-2' (JE TIER 2 Exam) పరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూనియర్ ఇంజినీర్ పేపర్-1(టైర్-1) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిసెంబర్ 4న దేశంలోని ప్రధాన కేంద్రాల్లో జేఈ పేపర్-2(టైర్-2) పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), పేపర్-2 (ఆఫ్‌లైన్ డిస్క్రిప్టివ్) రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.35,400- రూ.1,12,400 (సెవెన్త్ పే స్కేలు ప్రకారం) జీతం ఉంటుంది.
జేఈ పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం:
పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పేపర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుదిఎంపిక చేస్తారు. మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చరల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ఈ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
జేఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా అక్టోబర్ 9 నుంచి 11 వరకు పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని అక్టోబరు 13న ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను అక్టోబర్ 13న సాయంత్రం 5 గంటల నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. నవంబరు 29న ఫైనల్ కీని విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్ నంబర్, పాస్‌వర్డ్ సాయంతో ప్రశ్నపత్రం, కీలను డిసెంబర్ 13 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.
జేఈ పోస్టుల నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..