(Source: ECI/ABP News/ABP Majha)
SSC CAPF: ఎస్‌ఎస్‌సీ - ఎస్‌ఐ ఫిజికల్ ఈవెంట్స్ ఫలితాలు విడుదల, పేపర్-2కు 8544 మంది అర్హత
CPO: ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 20న విడుదల చేసింది.
CAPF SI PET/PMT Results: ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్ల (PET, PMT) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)లకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు.
ఫిజికల్ ఈవెంట్లలో మొత్తం 8544 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. అందులో 7855 పురుషులు, 621 మహిళలు ఉన్నారు. ఇక ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మొత్తం 68 మంది అభ్యర్థులు పేపర్-2కు అర్హత సాధించారు. పీఈటీ/ పీఎస్‌టీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరి 8న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-2లో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం అందుతుంది.
LIST-1: LIST OF FEMALE CANDIDATES QUALIFIED IN PET/PST FOR APPEARING IN PAPER-II 621
LIST-2: LIST OF MALE CANDIDATES QUALIFIED IN PET/PST FOR APPEARING IN PAPER-II 7855
LIST-3: SI IN DELHI POLICE AND CENTRAL ARMED POLICE FORCES EXAM., 2023 (PET/PST) 68
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 22న నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా..166 పోస్టులను మహిళలకు కేటాయించారు. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 3 నుంచి 5 వరకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహించారు ఈ పరీక్ష ఫలితాలను అక్టోబరు 25న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పేపర్-1 పరీక్షలో మొత్తం 31,368 మంది అర్హత సాధించారు. వీరిలో 2607 మంది మహిళలు ఉండగా.. 28,633 మంది పురుష అభ్యర్థుల అర్హత సాధించారు. ఇక ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ/ పీఎస్‌టీ) నిర్వహించారు. ఇందులో 8544 మంది పేపర్-2కు అర్హత సాధించారు.
పేపర్-2 పరీక్ష విధానం
మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్..
అన్ని దశలు దాటుకుంటూ వచ్చిన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీఎంఈ (డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్) నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.