అన్వేషించండి

SSC Stenographer Recruitment: 'స్టెనోగ్రాఫ‌ర్' నోటిఫికేషన్ విడుదల, 2006 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Stenographer Jobs: స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు. ఆగస్టు 17 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

SSC Stenographer Recruitment Notification: కేంద్రప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2024 నోటిఫికేషన్  విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 2006 స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నెంబరు-1800 309 3063 ద్వారా సంప్రదించవచ్చు.

వివరాలు..

* స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2024

ఖాళీల సంఖ్య: 2006 పోస్టులు

అర్హత‌: 17.08.2024 నాటికి ఇంట‌ర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 

➥ 01.08.2024 నాటికి స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు  02.08.1994 - 01.08.2006 మధ్య జన్మించి ఉండాలి. ఇక స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01.08.2024 - 02.08.1997 మధ్య జన్మించి ఉండాలి.

➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 8 సంత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

➥ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

➥ వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు) ద్వారా ఫీజు చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక‌ విధానం: ఆన్‌లైన్ రాతప‌రీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా.

పరీక్ష విధానం...

➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

➥ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.

➥ పరీక్ష సమయం 2 గంటలు. ప్రత్యేక అవసరాలుగల అభ్యర్థులకు 40 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తారు.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25  చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.

➥ పరీక్షలో కనీస అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 30 శాతంగా; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25 శాతంగా; ఇతరులకు 20 శాతంగా నిర్ణయించారు.

Stenographer Posts: 1207 'స్టెనోగ్రాఫ‌ర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
సదరన్ రీజియన్‌లో ప‌రీక్ష కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మ‌హేంద్రవ‌రం, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, చెన్నై, సేలం, కోయంబ‌త్తూరు, మ‌ధురై, తిరుచిరాప‌ల్లి, తిరున‌ల్వేలి, పుదుచ్చేరి, హైద‌రాబాద్, వ‌రంగ‌ల్.

స్కిల్ టెస్ట్:

Stenographer Posts: 1207 'స్టెనోగ్రాఫ‌ర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.07.2024.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 17.08.2024(23:00)

✦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 18.08.2024 (23:00)

✦ దరఖాస్తుల తప్పుల సవరణ తేదీ: 27.08.2024 to 28.08.2024 (23:00 hours)

✦ ఆన్‌లైన్ రాతపరీక్ష: 2024, అక్టోబరు-నవంబరులో. 

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Daryl Mitchel: డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Daryl Mitchel: డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Embed widget