అన్వేషించండి

SSC JE Results: జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌-1 ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 12,227 మంది అభ్యర్థులు అర్హత

SSC JE PAPER-1 RESULTS: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 17న విడుదల చేసింది.

SSC JE PAPER-1 RESULTS: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (Junior Engineer) ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commissions) నవంబరు 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం రెండు జాబితాల్లో ఫలితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో సివిల్ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను, రెండో జాబితాలో మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. ఫలితాలకు సంబంధించి పేపర్‌-1లో మొత్తం 12,227 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సివిల్ విభాగంలో 10,154 మంది అభ్యర్థులు; మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 2073 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు.   

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కటాఫ్ మార్కుల (Cut-off Marks) వివరాల కోసం క్లిక్ చేయండి..

JUNIOR ENGINEER (CIVIL) EXAM., 2023 (PAPER-1) LIST-1 RESULTS

JUNIOR ENGINEER (MECH & ELECT) EXAM., 2023 (PAPER-1) LIST-2 RESULTS 

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసిన సంగతి తెలిసిదే. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని 1324 జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. తాజాగా టైర్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: పేపర్-1,  పేపర్-2  కంప్యూటర్ ఆధారిత పరీక్షలు,  డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష విధానం:

✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.

✦ పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు (ప్రత్యేక అవసరాలుగలవారికి 2 గంటల 40 నిమిషాలు). పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 1/3వ వంతు  మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget