SSC CGL Result: సీజీఎల్ఈ 2021 'టైర్-2' ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా టైర్-2, 3 పరీక్షలు జరిగాయి. మొత్తం 7686 పోస్టుల భర్తీకి సీజీఎల్‌ఈ-2021 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(సీజీఎల్‌ఈ)-2021 టైర్-2 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 15న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా టైర్-2, 3 పరీక్షలు వివిధ కేంద్రాల్లో జరిగాయి. మొత్తం 7686 పోస్టుల భర్తీకి సీజీఎల్‌ఈ-2021 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
మొత్తం నాలుగు జాబితాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో ఏఏవో పోస్టులకు 2602 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండో జాబితాలో 511 మంది అభర్థులు జేఎస్‌వో పోస్టులకు అర్హత సాధించారు. మూడో జాబితాలో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 2631 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్టులో ఉన్నారు. ఇక చివరిదైనా నాలుగో జాబితాలో ఏఏవో, జేఎస్‌వో, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు కాకుంగా ఇతర ఉద్యోగాలకు 32,610 మంది అభ్యర్థులు షార్ట్‌టిస్ట్‌కు ఎంపికయ్యారు.
SSC CGLE 2021 TIER-II ఫలితాలను ఇలా చూసుకోండి..
Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - ssc.nic.in.
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Results' టాబ్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే వచ్చే పేజీలో 'Combined Graduate Level Examination (Tier-II), 2021' ఫలితాలకు సంబంధించిన లింక్స్ కనిపిస్తాయి. మొత్తం 4 జాబితాల్లో అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది.
Step 4: ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది.
Step 5: అభ్యర్థులు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫలితాలు చూసుకోవచ్చు.
Step 6: ఫలితాలు చూసుకోవడానికి కంప్యూటర్ కీబోర్డులో "Ctrl + F" కాంబినేషన్‌లో క్లిక్ చేసి సెర్చ్ బాక్సులో హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. నెంబరు కనిపించనివారు ఎంపికకానట్లే.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
LIST-1: Assistant Audit Officer & Assistant Accounts Officer (AAO) Posts
LIST-2: Junior Statistical Officer (JSO) Posts
LIST-3: Statistical Investigator (Grade-II) Posts
LIST-4: Other than AAO, JSO, Statistical Investigator Posts
కటాఫ్ మార్కులు, ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read
మల్టీటాస్కింగ్ స్టాఫ్ తుది ఫలితాలు వెల్లడి, 3887 మంది అభ్యర్థులు ఎంపిక!
మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 15న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం మల్టీటాస్కింగ్ స్టాఫ్ పేపర్-2 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పేపరులో అర్హత సాధించిన మొత్తం 9754 మంది అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎంపికయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులందరి మార్కుల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది.
ఎంటీఎస్ ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఆర్మీలో 128 రిలీజియస్ టీచర్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్‌టీ 91 & 92 కోర్సుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, అర్హతలివే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..