By: ABP Desam | Updated at : 25 Feb 2023 01:58 PM (IST)
Edited By: omeprakash
సీజీఎల్ టైర్-2 పరీక్ష షెడ్యూలు ( Image Source : ABP Graphics )
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022(సీజీఎల్) నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఫిబ్రవరి 24న ఖరారు చేసింది. టైర్-2 పరీక్షలు మార్చి 2 నుంచి 7 వరకు జరుగనున్నాయి. మార్చి 2, 3, 6, 7 తేదీల్లో పేపర్-1 పరీక్ష, అలాగే మార్చి 4న పేపర్-2, 3 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (సీజీఎల్)-2022 పరీక్ష (టైర్- 1) ఫలితాలను ఫిబ్రవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 3,86,652 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 25071 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ & అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు, 1149 మంది అభ్యర్థులు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, 3,60,432 మంది అభ్యర్థులు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు సంబంధించి టైర్-2 కు ఎంపికయ్యారు.
గతేడాది డిసెంబర్ 1 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు మార్చిలో టైర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
టైర్-2 పరీక్ష విధానం:
పోస్టుల వివరాలు..
* ఖాళీల సంఖ్య: 20,000
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్
➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
➥ అసిస్టెంట్
➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌ఐఏ)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ)
➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
IB Answer Key: ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారం, రంగంలోకి ఈడీ? పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందన్న అనుమానం!
TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!
SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
BMRCL: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో 68 ఇంజినీర్ ఉద్యోగాలు, అర్హతలివే!
Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన
ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్ కౌంటర్!
NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ
Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్