అన్వేషించండి

Staff Nurse: నర్సింగ్ సిబ్బందికి హోదామార్పు, నర్సింగ్‌ ఆఫీసర్లుగా స్టాఫ్‌ నర్సులు, ఇతర మార్పులు ఇలా

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. నర్సింగ్ సిబ్బందికి మరింత గౌరవం తీసుకువచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. నర్సింగ్ సిబ్బందికి మరింత గౌరవం తీసుకువచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్‌ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని.. వివిధ హోదాల్లో పేర్లు మార్చుతూ ‘ఆఫీసర్లు’గా ఖరారు చేసింది.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై స్టాఫ్‌ నర్స్‌ను నర్సింగ్‌ ఆఫీసర్‌గా, హెడ్‌ నర్స్‌ను సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేడ్‌-2ను డిప్యూటీ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేడ్‌-1ను చీఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా మార్పులు చేసింది. వైద్యారోగ్యశాఖతోపాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్‌ సిబ్బందికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌ పోస్టును పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా, డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టును యథాతథంగా ఉంచింది.

హోదా మార్పు పట్ల నర్సులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా హోదా మార్పు కోసం ఎదరుచూస్తున్న రాష్ట్ర నర్సింగ్‌ సమాజానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తీపికబరు అందించారని, తమ గౌరవాన్ని మరింత పెంచారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సీహెచ్‌సీ న‌ర్సులు హర్షం వ్యక్తం చేశారు. త‌మ కష్టానికి తగ్గ ఫలితంగా తాము భావిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు తాము ఎల్లప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌ని న‌ర్సులు స్పష్టం చేశారు. 

నమ్మకాన్ని మరింత పెంచండిమంత్రి హరీశ్‌ రావు
ప్రభుత్వ నర్సింగ్‌ సిబ్బందికి శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు, మీ గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ దవాఖానలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.

సమాచార శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు  గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ మేరకు ఆ శాఖలో 88 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల భర్తీకీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1384ను విడుదల చేసింది. ఆయా పోస్టులను పొరుగు సేవల పద్దతిలో నియమించాలని నిర్ణయించింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు గాను ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించినట్లు ఆర్థికశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వీటితోపాటు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి.

ALSO READ:

తెలంగాణ జెన్‌కో‌లో 60 కెమిస్ట్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.1.31 లక్ష వరకు జీతం
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ జెన్‌కో‌లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget