అన్వేషించండి

SSC Constable Key: కానిస్టేబుల్ (జీడీ) పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

Constable Answer Key: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఏప్రిల్ 3న విడుదల చేసింది.

SSC Constable Answer Key: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఏప్రిల్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి జవాబులు చూసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపడానికి ఎస్ఎస్‌సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏప్రిల్ 10న సాయంత్రం 6.30 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజుగా చెల్లించాలి. ఏప్రిల్‌ చివర లేదా మే నెలలో తుది కీతో పాటు ఫలితాలు వెల్లడికానున్నాయి.  

కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల భర్తీకి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు, సాంకేతిక కారణాల వల్ల కొన్ని కేంద్రాల్లో మార్చి 30న ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..

SSC Constable Key: కానిస్టేబుల్ (జీడీ) పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 6174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 11025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్‌(SSB)లో 635 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,189 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 1,490 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 296 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. 

రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 26,146

పోస్టుల కేటాయింపు: యూఆర్-10,809, ఈడబ్ల్యూఎస్-3633, ఓబీసీ-5360, ఎస్టీ-2602, ఎస్సీ-3742.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 6174 మెన్-5211, ఉమెన్-963
సీఐఎస్‌ఎఫ్‌ 11025 మెన్-9913, ఉమెన్-1112
సీఆర్‌పీఎఫ్‌ 3337 మెన్-3266, ఉమెన్-71
ఎస్‌ఎస్‌బీ 635 మెన్-593, ఉమెన్-42
ఐటీబీపీ 3189 మెన్-2694, ఉమెన్-495
ఏఆర్ 1490 మెన్-1448, ఉమెన్-42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296 మెన్-222, ఉమెన్-74
మొత్తం ఖాళీలు 26,146 26,146

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Embed widget