News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SSC GD Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఎప్పుడంటే?

ఎస్‌ఎస్‌సీ- కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి జులై 17 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేట్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఎస్‌ఎస్‌సీ- కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి జులై 17 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేట్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. త్వరలో ఈ అడ్మిట్‌ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30న విడుదలైన సంగతి తెలిసిందే. శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3.70 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ చేస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే 1 నుంచి 6 తేదీల్లో నిర్వహించింది. వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్‌(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఈ కీపై ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించాక ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.

మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. ‌తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య ‌50,187 పెరిగింది. 

మొత్తం 50,187 ఖాళీల్లో బీఎస్‌ఎఫ్‌లో 21,052; సీఐఎస్‌ఎఫ్‌లో 6,060; సీఆర్‌పీఎఫ్‌లో 11,169; ఎస్‌ఎస్‌బీలో 2274; ఐటీబీపీలో 5642, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 పోస్టులు ఉన్నాయి. ఎన్‌సీబీ మినహాయించి మొత్తం ఖాళీల్లో 44,439 పోస్టులు పురుషులకు, 5573 పోస్టులు మహిళలకు కేటాయించారు.

ALSO READ:

'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Jul 2023 10:59 AM (IST) Tags: SSC GD Constable Results ssc gd constable document verification SSC GD Certificate Verification SSC GD Constable Medical Tests SSC GD CAPF Constable DV 2023 SSC GD CAPF Constable 2023 Document Verification

ఇవి కూడా చూడండి

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

TTWREIS: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా

TTWREIS: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా

NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 43 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు, అర్హతలివే

NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 43 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు, అర్హతలివే

C-DAC: సీడ్యాక్‌ తిరువనంతపురంలో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు

C-DAC: సీడ్యాక్‌ తిరువనంతపురంలో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?