అన్వేషించండి

SSC CGL Application Status: సీజీఎల్ - 2024 అప్లికేషన్ స్టేటస్ వివరాలు వెల్లడి, ఇలా చూసుకోండి

SSC CGL: సీజీఎల్ 2024 పరీక్షకు సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్'ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. త్వరలోనే పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను విడుదల చేయనున్నారు.

SSC CGLE 2024 Application Status: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్-2024 పోస్టుల భర్తీకి సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్' లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్టివేట్ చేసింది. సీజీఎల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ వివరాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ ద్వారా తమ దరఖాస్తును స్వీకరించారా లేదా రిజక్ట్ చేశారా అన్నది అభ్యర్థులు తెలుసుకోవచ్చు. దరఖాస్తులు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దరఖాస్తులు రిజక్ట్ అయిన అభ్యర్థులు.. అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాతే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 9 నుంచి 26 వరకు ఆన్‌లైన్ రాతపరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో  చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

అప్లికేషన్ స్టేటస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

టైర్-1 పరీక్ష విధానంమొత్తం 200 మార్కులకు టైర్-1 సీబీటీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానంలో అమల్లో ఉంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.5 మార్కులు కోత విధిస్తారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 17,727

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

➥ అసిస్టెంట్

➥ ఇన్‌స్పెక్టర్ - (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)

➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)

➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)

➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్

➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్

➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)

➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)

➥ రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)

➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్  (NIA)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)

➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)

➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)

➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)

➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)

➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్

➥ జూనియర్ అకౌంటెంట్ (CGCA)

➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)

➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

➥  అప్పర్ డివిజన్ క్లర్క్

➥ ట్యాక్స్ అసిస్టెంట్

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

SSC CGL Notification 2024: 17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

టైర్-2 పరీక్ష విధానం:  

SSC CGL Notification 2024: 17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
JD Vance India Visit: ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు, మాక్ డ్రిల్స్ పూర్తి
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
JD Vance India Visit: ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు, మాక్ డ్రిల్స్ పూర్తి
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Telugu TV Movies Today: బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మహేష్ ‘దూకుడు’ to రామ్ చరణ్ ‘చిరుత’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 21) టీవీలలో వచ్చే సినిమాలివే
బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మహేష్ ‘దూకుడు’ to రామ్ చరణ్ ‘చిరుత’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 21) టీవీలలో వచ్చే సినిమాలివే
Embed widget